Vishwak Sen Gaami to Release on 8th March: మాస్ క దాస్ విశ్వక్ సేన్ ప్రేక్షకులలో తనదైన ముద్ర వేసుకున్న సంగతి తెలిసిందే. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లు చేయడంతో పాటు యూనిక్ కాన్సెప్ట్‌లతోనూ ప్రయోగాలు చేస్తున్న విశ్వక్ విద్యాధర్ కాగిత దర్శకత్వంలో చేసిన ప్రతిష్టాత్మక మూవీ ‘గామి’. కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ ఈ సినిమాను నిర్మించగా వి సెల్యులాయిడ్స్ సమర్పిస్తోంది. తాజాగా మేకర్స్ హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. సినిమాను మార్చ్ 8న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది సినిమా యూనిట్. ‘ఈ చిత్రంలో విశ్వక్ సేన్ ‘శంకర్’ అనే అఘోరాగా కనిపించనున్నారు. అయితే అతనికి చాలా రేర్ కండీషన్ ఉంటుంది, అతను ఏ మానవ స్పర్శను అనుభవించలేడు’ అని మేకర్స్ చెబుతున్నారు.
ఈ సినిమాలో కలర్ ఫోటో ఫేమ్ చాందిని చౌదరి కథానాయికగా నటిస్తుండగా, ఎం జి అభినయ, హారిక, మహమ్మద్ సమద్ ముఖ్య తారాగణంగా ఉన్నారు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ విశ్వనాథ్ రెడ్డి, రాంపీ నందిగాం అందిస్తున్నారు. నరేష్ కుమారన్ మ్యూజిక్. అందిస్తున్న ఈ సినిమాకి విద్యాధర్ కాగిత, ప్రత్యూష్ వత్యం స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన రోజునే విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న మరో సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు గామి రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించడం హాట్ టాపిక్ అవుతోంది. దీంతో ఆ సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. గోపీచంద్ భీమా సినిమాను కూడా ఆరోజునే రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. మరోపక్క ఎర్రచీర అనే చిన్న సినిమా కూడా అదే రోజున రిలీజ్ అవుతోంది.
