Site icon NTV Telugu

Vishwak Sen: విశ్వక్ సేన్ షాకింగ్ డెసిషన్.. అప్పుడేనా?

Vishwak Sen

Vishwak Sen

Vishwak Sen entry on OTT: 100% తెలుగు ఓటీటీ మాధ్య‌మంగా చెబుతున్న ‘ఆహా’లో వెర్సటైల్ హీరో విశ్వక్ సేన్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే తెలుగు ప్రేక్ష‌కులకు దగ్గరైన ఆహాలో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లో, స్పెష‌ల్ టాక్ షోస్‌, రియాలిటీ షోస్ తో అలరిస్తోంది. ఇక అందులో భాగంగా ఇప్పుడు మ‌రో విల‌క్ష‌ణ‌మైన షో తో ముందుకు వచ్చేందుకు సిద్దమైంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆహా ఇప్పుడు హీరో విశ్వ‌క్ సేన్‌ ను ఆడియెన్స్‌ను అల‌రించ‌టానికి సిద్ధం చేస్తోంది. ల‌క్‌నుమా దాస్‌, హిట్‌, ఓరి దేవుడా, దాస్ కా ధ‌మ్కీ వంటి వైవిధ్య‌మైన చిత్రాల‌తో కెరీర్ ప్రారంభం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు విల‌క్ష‌ణ‌మైన సినిమాలు చేస్తూ హీరోగా త‌న‌దైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న యువ హీరో విశ్వ‌క్ సేన్‌ డిజిటల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు.

Razakar: మాజీ గవర్నర్, ఎంపీల చేతుల మీదుగా రజాకర్ మూవీ పోస్టర్ లాంచ్

అసలు విషయం ఏమిటంటే ఇప్ప‌టి వ‌ర‌కు విశ్వ‌క్ సేన్‌ను చూడ‌న‌టువంట స‌రికొత్త అవ‌తార్‌లో ఆహా అతన్ని ఆవిష్క‌రించ‌డానికి సిద్దమైనట్టు ప్రచారం జరుగుతోంది. ఫుల్ మీల్స్ లాంటి ఎంటర్టైనింగ్ షో ని 15 ఎపిసోడ్స్‌ గా సిద్ధం చేస్తోందని త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నున్నట్టు తెలుస్తోంది. నిజానికి విశ్వక్ సేన్ కి ఇప్పుడు మంచి మంచి సినిమా అవకాశాలు ఉన్నాయి. అలాంటిది ఆయన సినిమాల మీద దృష్టి పెట్టకుండా ఇలా చేయడం ఏమాత్రం బాలేదని ఆయన అభిమానులు అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి షోలు చేయడం ఆయన కెరీర్ మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందా? అనే చర్చ జరుగుతోంది. అయితే నిజానికి ఆహాలో బాలయ్య లాంటి స్టార్ హీరో ఏకంగా ఒక షోని రెండు సీజన్స్ కి హోస్ట్ గా వ్యవహరించి ఆకట్టుకున్నారు. విశ్వక్ కి ఈ షో ఎలా కలిసి వస్తుందో చూడాలి.

Exit mobile version