Site icon NTV Telugu

Vishwak Sen: ఇంకా ఎంతమందిని మోసం చేస్తావ్ రా..

Vishwak

Vishwak

Vishwak Sen: దాస్ కా మాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ధమ్కీ. వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విశ్వక్ సరసన నివేతా పేతురాజ్ నటిస్తోంది. ఇక ఇటీవలే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటుంది. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ 1.ఓ అనే పేరుతో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఆరేళ్ళ వయసున్న కంపెనీ.. పదివేల కోట్ల టర్నవర్ ఇవన్నీ ఒక్కరాత్రిలో స్టేట్ లో పడిపోయాయి.. సాయానికి ఒక గడ్డిపోచ అయినా దొరకకపోతుందా”అని రావు రమేష్ అనే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమయ్యింది. ఇక ఈ సినిమాలో విశ్వక్ డబుల్ రోల్ చేసినట్లు తెలుస్తోంది. ఒక కంపెనీ సీఈఓ అయిన విశ్వక్.. ఒక రాత్రి యాక్సిడెంట్ లో చనిపోతాడు. ఆ కంపెనీని నిలబెట్టడానికి అదే రూపంలో ఉన్న వెయిటర్ గా పనిచేస్తున్న ఇంకో విశ్వక్ ను తీసుకొచ్చి ఆ ప్లేస్ లో కుర్చోపెడతారు.

ఇక ఆ కంపెనీని, ఆ కుటుంబాన్ని రెండో విశ్వక్ ఎలా సేవ్ చేశాడు..? కంపెనీ సీఈవోను చంపింది ఎవరు..? అనేది సినిమ చూసి తెలుసుకోవాల్సిందే. విశ్వక్ సినిమా అంటే ఎక్స్పెక్ట్ చేసిన అన్ని హంగులు ఇందులో ఉన్నాయి. బూతులు ఏ మాత్రం కొదువ లేదని తెలుస్తోంది. హీరోయిన్ చేత కూడా ఇంకా ఎంతమందిని మోసం చేస్తావ్ రా.. అని ఎఫ్ పదాన్ని అనిపించారు. ఇక విశ్వక్ డబుల్ రోల్స్ లో వైవిధ్యం చూపించాడు. ఇక డబ్బున్న కుర్రాడు అనుకోని వెయిటర్ వెనుక పడే పాత్రలో నివేతా కనిపించింది. మొత్తానికి ఈ కథను చూస్తుంటే.. నాని నటించిన జెంటిల్మెన్ గుర్తుకు రాకుండా మానదు. కానీ, ఇందులో విశ్వక్ కొద్దిగా మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో విశ్వక్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Exit mobile version