మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘దాస్ కా ధమ్కీ’. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా అనౌన్స్ అయిన ఈ మూవీని ముందుగా తెలుగులో మాత్రమే రిలీజ్ చేశాడు విశ్వక్. తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయిన ‘దాస్ కా ధమ్కీ’ సినిమా విశ్వక్ సేన్ ని ఒక హీరోగా, ఒక దర్శకుడిగా మంచి పేరు తెచ్చి పెట్టింది. ముఖ్యంగా నెగటివ్ షేడ్ లో విశ్వక్ సేన్ యాక్టింగ్ కి మంచి పేరొచ్చింది. ఈ మూవీ ‘ఆహా’లో ఏప్రిల్ 14న స్ట్రీమ్ అవ్వనుంది, థియేటర్స్ లో మిస్ అయిన వాళ్లు దాస్ కా ధమ్కీ సినిమాని ఓటీటీలో చూడడానికి రెడీ అవుతున్నారు. ఇలాంటి సమయంలో మళ్లీ హిందీ రిలీజ్ ని బయటకి తీసి అందరికీ షాక్ ఇచ్చాడు విశ్వక్ సేన్. తెలుగులో ఓటీటీలో రిలీజ్ అవుతున్న రోజే, హిందీలోకి దాస్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఏప్రిల్ 14 నుంచి దాస్ కా ధమ్కీ సినిమాని హిందీలో రిలీజ్ చేస్తున్నాను అని అనౌన్స్ చేస్తూ విశ్వక్ సేన్, హిందీ ట్రైలర్ వెర్షన్ ని రిలీజ్ చేశాడు. దాదాపు తెలుగు ట్రైలర్ లానే హిందీ ట్రైలర్ విజువల్స్ ఉన్నాయి కానీ ఆడియో మాత్రం తేడా కొడుతుంది. విశ్వక్ సేన్ కి డబ్బింగ్ ఎవరు చెప్పారో కానీ అది విశ్వక్ బాడీ లాంగ్వేజ్ కి సెట్ అవ్వలేదు.
విశ్వక్ బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ గా ఉంటుంది, అతని డైలాగ్ డెలివరీలో కూడా నేటివిటీ ఉంటుంది. హిందీ ట్రైలర్ లో విశ్వక్ సేన్ ని చూస్తుంటే, డబ్బింగ్ సెట్ అవ్వలేదు అనే విషయం క్లియర్ గా తెలుస్తోంది. ఎన్టీఆర్ కి మంచి ఫ్యాన్ అయిన విశ్వక్ సేన్, తన ఫేవరేట్ హీరోని ఫాలో అవుతూ హిందీలో కూడా తనే డబ్బింగ్ చెప్పుకోని ఉంటే బాగుండేది కానీ విశ్వక్ ఎందుకో ఆ రిస్క్ చెయ్యలేదు. ఇదిలా ఉంటే నార్త్ ఆడియన్స్ కి తగ్గట్లు ఫైట్స్, రోమాన్స్, కామెడీ లాంటి ఎలిమెంట్స్ దాస్ కా ధమ్కీ సినిమాలో ఉన్నాయి కాబట్టి హిందీలో కూడా మంచి రీచ్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ ని మాత్రమే రీచ్ అయిన సినిమా కోసం విశ్వక్ నార్త్ కి వెళ్లి మరీ తన సినిమాని ప్రమోట్ చేస్తాడా? అనేది ఆలోచించాల్సిన విషయమే. ఒకవేళ ప్రమోషన్స్ చెయ్యకపోతే విశ్వక్ సేన్ సినిమాకి హిందీలో అంతంతమాత్రంగానే కలెక్షన్స్ వస్తాయి.
A Mass feast with a double treat 😎#DasKaDhamki HINDI TRAILER 2.0 is out now 🔥
Releasing WW IN CINEMAS on APRIL 14th 💥
@Nivetha_Tweets @leon_james @VanmayeCreation @VScinemas_ @saregamaglobal pic.twitter.com/ndfHUSeZRU
— VishwakSen (@VishwakSenActor) April 12, 2023
