NTV Telugu Site icon

Dhamki: పాన్ ఇండియా సినిమా నుంచి సాంగ్ వచ్చేస్తోంది…

Dhamki

Dhamki

ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో విశ్వక్ సేన్ కి ఒక స్పెషాలిటీ ఉంది. ఏ యంగ్ హీరోకి లేని ఫిల్మోగ్రఫీ విశ్వక్ సేన్ సొంతం. ‘ఫలక్ నామా దాస్’ సినిమాతో మాస్ కుర్రాడిగా కనిపించిన విశ్వక్, ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో యూత్ కి కనెక్ట్ అయ్యే రోల్ చేశాడు. ‘హిట్’ సినిమాలో పోలిస్ పాత్ర చేసిన విశ్వక్, చాలా వేరియేషణ్ చూపించాడు. ఆ తర్వాత ‘పాగల్’ సినిమాలో లవర్ బాయ్ గా కనిపించిన విశ్వక్, నేను మాస్ హీరోనే కాదు లవ్ స్టొరీలు కూడా చేయగలనని నిరూపించాడు. ఇక విశ్వక్ సేన్ నుంచి అసలు ఊహించని సినిమా ఏదైనా ఉందా అంటే అది ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమానే.

మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్న ఒక యంగ్ హీరో… తెరపై బట్టతల, పొట్టతో ఒక ముప్పై అయిదేళ్ల వ్యక్తిగా కనిపించాలి అనుకోవడం సాహసమే. మాస్ సినిమాలు చేసే తనని, ఇలాంటి పాత్రలో ఆడియన్స్ ఒప్పుకుంటారా అనే భయంతోనే సగం మంది హీరోలు ప్రయోగాలు చేయరు. ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ అలాంటి ప్రయోగమే. సీరియస్ డైలాగ్స్ చెప్పి విజిల్స్ వేయించే విశ్వక్, అమాయకంగా డైలాగ్స్ చెప్పి ఎమోషనల్ సీన్స్ లో ఆడియన్స్ ని మెప్పించగలను అని ప్రూవ్ చేశాడు. ఇలా సినిమా సినిమాకి తన పాత్రలో వేరియేషన్స్ ఉండేలా చూసుకుంటున్న ‘విశ్వక్ సేన్’ తన మార్కెట్ పెంచుకోవడానికి చేస్తున్న సినిమా ‘ధమ్కీ’.

పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి విశ్వక్ సేన్ దర్శకత్వం వహిస్తుండడం విశేషం. ఇటివలే ఈ సినిమా ట్రైలర్ 1.0ని రిలీజ్ చేసిన విశ్వక్ సేన్, మాస్ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టాడు. ఈ ట్రైలర్ వచ్చిన తర్వాత ‘ధమ్కీ’ సినిమాపై అంచనాలు పెరిగాయి. నివేత పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టిన విశ్వక్ సేన్, ‘ధమ్కీ’ సినిమా ఫస్ట్ సాంగ్ ని డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు. లియోన్ జేమ్స్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ‘ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా’ అనే బీచ్ సాంగ్ ట్రైలర్ లో కొంచెం చూపించారు. క్యాచీగా ఉన్న ఈ పాట చార్ట్ బస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ‘ధమ్కీ’ మూవీతో విశ్వక్ సేన్ పాన్ ఇండియా హీరో అవుతాడో లేదో చూడాలి అంటే వచ్చే ఫిబ్రవరి 17 వరకూ ఆగాల్సిందే.