NTV Telugu Site icon

Vishwak Sen: నెక్స్ట్ జనరేషన్ ఎన్టీఆర్ నువ్వే.. విశ్వక్ ఏమన్నాడంటే..?

Vishwak

Vishwak

Vishwak Sen:మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల కన్నా ఎక్కువ వివాదాలతోనే ఫేమస్ అయ్యాడు విశ్వక్. మనసులో ఏది ఉంచుకోకుండా తనకు ఏది అనిపిస్తే అది చెప్పేయడం వలనే విశ్వక్ పై చాలా నెగెటివిటీ ఉంది అని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నా నెటిజన్స్ మాత్రం విశ్వక్ కు కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ అని తేల్చేశారు. ఇక హీరోగానే కాకుండా డైరెక్టర్ గా కూడా తన సత్తా చాటుతున్నాడు. తాజాగా విశ్వక్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ధమ్కీ. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా కొన్ని కారణాల వలన వాయిదాలు పడుతూ పడుతూ చివరికి ఉగాది కానుకగా మార్చి 22 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్ ఆసక్తిని కలిగించగా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ రావడంతో సినిమాపై ఒక్కసారిగా హైప్ వచ్చేసింది.

Suriya: తండ్రితో విబేధాలు.. భార్యాబిడ్డలతో సహా బయటికి వెళ్ళిపోయిన సూర్య..?

ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో విశ్వక్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటున్నాడు. విశ్వక్ కు ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టమో ఆయన ప్రతి ఈవెంట్ లోనూ చెప్పుకొస్తూనే ఉన్నాడు. ఇండియాలోనే బెస్ట్ యాక్టర్ ఎన్టీఆర్ అని, ఆయన తనకు దేవుడులాంటివాడని చెప్పుకొచ్చాడు. ఇక ఎన్టీఆర్ బిగ్గెస్ట్ ఫ్యాన్ కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ.. విశ్వక్ కు సపోర్ట్ గా నిలుస్తున్నారు. నెక్స్ట్ జనరేషన్ ఎన్టీఆర్ నువ్వే అన్నా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఇదే ప్రశ్న విశ్వక్ కు ఒక ఇంటర్వ్యూలో ఎదురైంది. నెక్స్ట్ జనరేషన్ ఎన్టీఆర్ మీరే అంటున్నారు.. దాని గురించి మీరేమనుకుంటున్నారు అన్న ప్రశ్నకు విశ్వక్ మాట్లాడుతూ.. ” అలా ఏం లేదండి. అన్నకు అన్న పేరు ఉంది.. నాకు నా పేరు ఉంది. ఆయన నా ఈవెంట్ కు రావడం నేను చేసుకున్న అదృష్టం” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments