Site icon NTV Telugu

Vishwa Karthikeya: ఇండోనేషియన్ ప్రాజెక్టులో తెలుగు హీరో విశ్వ కార్తికేయ

Vishwa Karthikeya

Vishwa Karthikeya

Vishwa Karthikeya to act in Indonesia Movie: మన టాలీవుడ్ ఖ్యాతి ఎల్లలు దాటి ప్రపంచ దేశాల్లో రెపరెపలాడుతోంది. హాలీవుడ్ మేకర్లు సైతం టాలీవుడ్ గురించి దేశ విదేశ వేడుకల మీద మాట్లాడుకుంటున్నారు. మన హీరోలు, దర్శకుల పనితనం చూసి అంతా ఆశ్చర్యపోతున్న తరుణంలో మన తెలుగు హీరో ఓ ఇండోనేషియన్ ప్రాజెక్టులో నటించబోతున్నారు. టాలీవుడ్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి హీరోగా దూసుకుపోతోన్న విశ్వ కార్తికేయ, కలియుగం పట్టణంలో సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న ఆయుషీ పటేల్ హీరో హీరోయిన్లు గా ఇండోనేషియన్ ప్రాజెక్టులో నటిస్తున్నారు. టాలీవుడ్‌లో దాదాపుగా 50కి పైగా చిత్రాల్లో బాలనటుడిగా విశ్వ కార్తికేయ నటించారు. బాలకృష్ణ, రాజశేఖర్, బాపు, రాజేంద్ర ప్రసాద్ ఇలా ఎంతో మంది సినిమాల్లో విశ్వ నటించి అలరించాడు.

Sheena Chohan: “అమర్-ప్రేమ్” కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న షీనా చోహన్

రాజశేఖర్ గోరింటాకు, రోహిత్ జానకి వెడ్స్ శ్రీరామ్, విష్ణు, శ్రీకాంత్ లేత మనసులు, మోహన్ బాబు శివ శంకర్, బాలయ్య బాబు అధినాయకుడు వంటి సినిమాల్లో విశ్వ చిన్ననాటి పాత్రలో నటించాడు. జైసేన, కళాపోషకులు, అల్లంత దూరాన వంటి సినిమాల్లో మంచి నటనను కనబరిచిన విశ్వ కార్తికేయ ప్రస్తుతం కలియుగం పట్టణంలో అంటూ ఓ ఇంటెన్స్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగానే ఇండోనేషియన్ ప్రాజెక్ట్‌లో వీరు ఇద్దరు ఆఫర్ పట్టేశారని తెలుస్తోంది. ‘శూన్యం చాప్టర్ 1’ అంటూ రాబోతోన్న ఈ మూవీలో హిందీ, ఇండోనేషియన్ భాషల్లోని నటీనటులు ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. అతీంద్రీయ శక్తుల కాన్సెప్ట్‌తో ఈ సినిమా రాబోతోంది. సిల్వర్ బ్లైండ్స్ (ఇండోనేషియా) బ్యానర్ మీద రాబోతోన్న ఈ మూవీకి దర్శక, నిర్మాణ బాధ్యతలను సీకే గౌస్ మోదిన్ నిర్వర్తిస్తున్నారు. ఉన్ని రవి (యూఎస్ఏ) కెమెరామెన్‌గా పని చేస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీ, బహస (ఇండోనేషియన్ భాష) భాషల్లో ఈ సినిమా రానుంది.

Exit mobile version