Site icon NTV Telugu

Mark Antony: మార్క్ ఆంటోనీ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. ఆరోజు నుంచే స్ట్రీమింగ్

Mark Antony

Mark Antony

Vishal’s Mark Antony Movie OTT Release Date : హీరో విశాల్, ఎస్జే సూర్య ద్విపాత్రాభినయం చేసిన గ్యాంగ్‌స్టర్ కామెడీ డ్రామా ‘మార్క్ ఆంటోనీ’ సెప్టెంబర్ 15, 2023న థియేటర్‌లలో రిలీజ్ అయింది. తెలుగు, తమిళంలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రాగా ఈ సినిమాను తమిళ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా పెద్దగా వసూళ్లు రాబట్టలేక పోయినప్పటికీ, ఓవరాల్ గా పాజిటివ్ రివ్యూలు రాబట్టి బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. రీతూ వర్మ, సునీల్, అభినయ, సెల్వరాఘవన్, మరియు వై.జి.మహేంద్రన్ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించగా జి.వి.ప్రకాష్ సంగీతం అందించారు. అక్టోబర్ 13న, ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది అని అంటూ అధికారికంగా ప్రకటన వచ్చేసింది.

Nandamuri Mokshagna: శ్రీలీల వెనుకే నందమూరి వారసుడు.. మతలబు క్యా హై ..?

తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమ్ కానుంది. ఇక మార్క్ ఆంటోని చిత్రం థియేటర్లలో విడుదలైన 4 వారాల తర్వాత OTTలో విడుదల అవుతోంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తీసిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ భారీగానే వసూళ్లు రాబట్టి. తమిళంలో దాదాపు రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు తెచ్చిపెట్టింది. ఈ చిత్రాన్ని హిందీలో విడుదల చేసేందుకు రూ.6.5 లక్షలు లంచం ఇవ్వాల్సి వచ్చిందని ఆరోపిస్తూ గత వారం చిత్ర నిర్మాత విశాల్ ముంబైలోని సీబీఎఫ్‌సీ అధికారులపై సోషల్ మీడియాలో దావా వేశారు. చేసిన లావాదేవీల వివరాలను పంచుకున్న తర్వాత ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. ఇక సీబీఐలో కేసు నమోదు చేసి ముగ్గురు అధికారులను కూడా అరెస్టు చేశారు.

Exit mobile version