Site icon NTV Telugu

Vishal : అవార్డులన్నీ డ్రామా.. నాకొస్తే చెత్తలో పడేస్తా!

Vishal

Vishal

తెలుగు–తమిళ సినీ పరిశ్రమల్లో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కలిగిన హీరో విశాల్. ‘ప్రేమ చదరంగం’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విశాల్‌, ‘పందెం కోడి’తో స్టార్‌ హీరోగా స్థిరపడ్డారు. కానీ వరుసగా మూసపాత్రల్లో కనిపించడం వల్ల కొంతకాలంగా ఆయనకు హిట్‌ దూరమైంది. అయితే 12 ఏళ్ల క్రితం నిలిచిపోయిన ‘మదగజరాజా’ సినిమాతో తిరిగి రంగప్రవేశం చేసి, సంక్రాంతికి మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రజంట్ పలు చిత్రాల్లో బిజీగా గడుపుతున్నారు. మూవీస్ విషయం పక్కన పెడితే విశాల్ ముక్కుసూటి మనిషి అనే విషయం మనకు తెలిసిందే. ఎలాంటి టాపిక్ అయిన నిర్మొహమాటంగా మాట్లాడతారు. ఇందులో భాగంగా తాజాగా మళ్లీ తన బోల్డ్‌ కామెంట్స్‌తో హాట్‌ టాపిక్‌ అయ్యాడు.

Also Read : Devara Part 2 : ‘దేవర 2’ కథలో భారీ ట్విస్ట్ – నార్త్ ఆడియన్స్ కోసం స్పెషల్ ప్లాన్!

యాక్షన్‌, కమర్షియల్‌ సినిమాలతో అభిమానుల్లో ప్రత్యేకమైన క్రేజ్‌ సంపాదించిన ఆయన తాజాగా తన “Yours Frankly Vishal” పోడ్‌కాస్ట్‌లో అవార్డుల గురించి మాట్లాడారు.‘అవార్డులు కొంత మంది ఇష్టానికి ఇస్తారు. 8 మంది సభ్యులు 8 కోట్ల మంది ప్రేక్షకుల అభిప్రాయాన్ని తేల్చ లేరు. ఇలాంటి అవార్డులు అంటే నాకు విలువ లేదు. ఎవరైనా నాకు అవార్డు ఇస్తే నేరుగా చెత్తబుట్టలో పడేస్తాను” అని అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండగా, అభిమానులు ఆయన నిజాయితీకి చప్పట్లు కొడుతున్నారు.

Exit mobile version