NTV Telugu Site icon

Vishal: కెప్టెన్ విజయకాంత్ మృతి.. వెక్కి వెక్కి ఏడ్చిన విశాల్

Vaijya

Vaijya

Vishal: కోలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. కెప్టెన్ విజయకాంత్ కరోనాతో మృతి చెందారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స తీసుకున్న ఈ మధ్యనే ఇంటికి తిరిగి వచ్చారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, కొద్దికొద్దిగా కోలుకుంటున్నారని విజయకాంత్ భార్య తెలుపడంతో అభిమానులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ, అంతలోనే కరోనా ఎటాక్ అవ్వడంతో విజయకాంత్ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక ఆయన మరణంతో ఒక్కసారి ఇండస్ట్రీ మూగబోయింది. ఇండస్ట్రీలోని ప్రముఖులు.. కెప్టెన్ తో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు. రేపు సాయంత్రం 4.30గంటలకు కోయంబేడులోని డిఎండికే కేంద్ర కార్యాలయంలో విజయ్ కాంత్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక తాజాగా హీరో విశాల్.. కెప్టెన్ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు. వెక్కి వెక్కి ఏడుస్తూ.. ఒక వీడియోను రిలీజ్ చేశాడు.

“నా జీవితంలో నేను కలిసిన అత్యంత ఉన్నతమైన వ్యక్తుల్లో ఒకరైన #CaptainVijaykanth అన్న మరణవార్త విన్న తర్వాత నాకు కాళ్లుచేతులు ఆడలేదు. కెప్టెన్ లేదు అన్న మాట నేను ఉహించుకోలేకపోతున్నాను. ఆయన నుంచి నేను సామజిక సేవ నేర్చుకున్నాను. కెప్టెన్ అన్నా.. ఈ రోజు వరకు మిమ్మల్ని అనుసరిస్తున్నాను మరియు మీ పేరు మీద అలానే ఉంటాను. మన సమాజానికి అవసరమయ్యే అలాంటి వారిని దేవుడు ఎందుకు అంత త్వరగా దూరం చేస్తాడు. మిమ్మల్ని చివరిసారి చూడడానికి అక్కడ లేనందుకు చింతిస్తున్నాను. నాకు స్ఫూర్తి ఇచ్చిన యోధుడు మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. మీరు చాలా కాలం గుర్తుండిపోతారు. ఎందుకంటే ప్రజలకు మరియు నడిగర్ సంఘం కోసం మీరు చేసిన సేవ ప్రతి ఒక్కరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉంటుంది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Show comments