Site icon NTV Telugu

Vishal: లంచగొండి సెన్సార్ అధికారి బాగోతం బట్టబయలు చేసిన విశాల్

Vishal

Vishal

Vishal Sensational allegation on Mumbai CBFC Officer Corruption: మార్క్ ఆంటోనీ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విశాల్ ఇప్పుడు ఒక సెన్సార్ అధికారి లంచగొండితనం గురించి సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా ఈ విషయం మీద విశాల్ ఒక సుదీర్ఘ ట్వీట్ చేస్తూ ఒక వీడియో సైతం రిలీజ్ చేశారు. ఇక అవినీతిని వెండితెరపై చూపిస్తున్నారు కానీ నిజ జీవితంలో అది సరి కాదని పేర్కొన్న ఆయన ఇది జీర్ణించుకోలేకపోతున్నా అని అంటూ పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌ ముంబై కార్యాలయంలో ఇంకా దారుణం జరుగుతోంది. నా సినిమా మార్క్ ఆంటోనీ హిందీ వెర్షన్ కోసం 6.5 లక్షలు చెల్లించాల్సి వచ్చింది.

Movies Releasing: మూవీ లవర్స్ కి పండుగే.. రెండు రోజుల్లో 15 సినిమాలు

2 లావాదేవీలుగా స్క్రీనింగ్ కోసం 3 లక్షలు, సర్టిఫికేట్ కోసం 3.5 లక్షలు. నా కెరీర్‌లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. ఈ రోజు విడుదలైన సినిమా నుండి చాలా ఎక్కువ వాటా నాపేరున ఉన్నందున సంబంధిత మధ్యవర్తి మేనగాకి డబ్బు చెల్లించడం తప్ప వేరే మార్గం లేదు. ఈ విషయాన్ని గౌరవ మహారాష్ట్ర ముఖ్యమంత్రి మరియు నా గౌరవప్రదమైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకు వెళ్తున్నాను. ఇలా చేయడం నా కోసం కాదు సినిమాలు చేయబోతున్న నిర్మాతల కోసం. నేను కష్టపడి సంపాదించిన డబ్బు అవినీతికి పోయిందా అందుకు అవకాశమే లేదు. అందరూ చూడడానికి సాక్ష్యం కూడా ఇస్తున్నా సత్యం ఎప్పటిలాగే గెలుస్తుందని ఆశిస్తున్నాను అని ఆయన ట్వీట్ చేసారు.

Exit mobile version