NTV Telugu Site icon

Vishal : తన ఆరోగ్య పరిస్థితి గురించి నోరు విప్పిన విశాల్

Vishal

Vishal

 

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఆరోగ్యంపై ఇటీవల సోషల్ మీడియాలో చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. నిజాలు తెలియకుండా ఆయన హెల్త్ గురించి వరుస పుకార్లు పుట్టిస్తున్నారు. ఇక తాజాగా శనివారం సాయంత్రం ‘మద గజ రాజ’ ప్రీమియర్ కు హజరైన విశాల్.. తన ఆరోగ్యం పై వస్తున్న వార్తల పై స్పందించారు.

విశాల్ మాట్లాడుతూ ‘మా నాన్న వల్లే నేనెంతో ధైర్యంగా ఉన్నా. ఆయనంటే నాకెంతో ఇష్టం. నా తండ్రిని చూసి జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడుతున్న. ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే.. మూడు లేదా ఆరు నెలలకొకసారి సినిమాలకు బ్రేక్ ఇచ్చి వెళ్లిపోతున్నానని కొంతమంది అంటున్నారు. ప్రస్తుతం నాకు ఎలాంటి సమస్యలు లేవు. అంతా బాగానే ఉంది. ఇప్పుడు నా చేతులు వణకడం లేదు. మైక్ కూడా కరెక్ట్ పట్టుకోగలుగుతున్నా ఇటీవల మీరు చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. గెట్ వెల్ సూన్, కమ్ బ్యాక్ అంటూ మీరు పెట్టిన సందేశాలే నన్ను కోలుకునేలా చేశాయి. నా తుది శ్వాస వరకు మీ అభిమానాన్ని మర్చిపోను’ అని విశాల్ తెలిపారు. నిజంగా విశాల్ చెప్పినట్లుగానే లాస్ట్ ఈవెంట్‌తో పోలిస్తే ఇందులో ఆయన ఆరోగ్యంగా, చాలా ఫిట్ గా కనిపించారు.

తమ హీరో మాటలు విన్న అభిమానులకు మనసు కొంత కుదుట పడింది . ఇంకా పూర్తిగా కోలుకుని మునుపటి విశాల్ గా మేము మిమ్మల్ని చూడాలి అని ఫ్యాన్స్ కోరుతున్నారు. విశాల్ కి తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతను తమిళ్ లో నటించిన ప్రతి ఒక సినిమా తెలుగులో కూడా విడుదల అవుతాయి. దీంతో తెలుగు ప్రేక్షకులు కూడా విశాల్ పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

 

 

Show comments