Site icon NTV Telugu

దసరాకే విశాల్ ‘ఎనిమీ’

విశాల్ నటించిన ‘ఎనిమీ’ సినిమా దసరా విడుదలకు సిద్ధం అవుతోంది. ఆర్య విలన్ గా నటించిన ఈ సినిమా ‘టీజర్’తోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో విజువల్ గ్రాండియర్ గా రూపొందిన ఈ సినిమా కోసం కోలీవుడ్ ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తమన్ స్వరపరిచిన పాటలు కూడా విడుదలై ఆకట్టుకుంటున్నాయి. దసరాకు తెలుగు, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. విడుదల తేదీ ప్రకటిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్‌లో ఆర్య, విశాల్ లుక్స్ ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్ వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు. మృణాళి రవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మమతా మోహన్ దాస్, ప్రకాష్ రాజ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

Exit mobile version