NTV Telugu Site icon

విశాల్ “సామాన్యుడు” కాడు… ఫస్ట్ లుక్ పోస్టర్

Vishal 31 Movie Title and First Look Revealed

కోలీవుడ్ హీరో విశాల్ ఇంటెన్సివ్ యాక్షన్ డ్రామా “విశాల్ 31” అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న విషయం తెలిసిందే. నూతన దర్శకుడు తు పా శరవణన్ ఈ మూవీని రూపొందిస్తున్నారు. విశాల్ పుట్టినరోజు సందర్భంగా కొద్దిసేపటి క్రితం ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ (VFF) బ్యానర్‌పై విశాల్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. “విశాల్ 31” తెలుగు వెర్షన్ టైటిల్ ను “సామన్యుడు” అని పోస్టర్ ద్వారా ప్రకటించారు. “నాట్ ఎ కామన్ మ్యాన్” అనేది ట్యాగ్‌లైన్.

Read Also : హనీ సింగ్ కు కోర్టు అక్షింతలు

పోస్టర్‌లో విశాల్ ఒక బేస్‌బాల్ బ్యాట్‌తో రౌడీల బ్యాచ్‌ని చితక్కొడుతున్నట్లుగా కన్పిస్తోంది. ఫస్ట్ లుక్ లో ఆయన సీరియస్ గా చూస్తున్నట్లు కన్పిస్తోంది. “సామాన్యుడు” చిత్రంలో టాలీవుడ్ బ్యూటీ డింపుల్ హయతి కథానాయిక. ఈ చిత్రంలో ప్రముఖ కోలీవుడ్ నటులు యోగి బాబు, బాబురాజ్ జాకబ్, పిఎ తులసి, రవీనా రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

Show comments