Site icon NTV Telugu

గల్లీ రౌడీ : “విశాఖపట్నంలో రౌడీ గాడో” సాంగ్

Visakhapatnam lo Rowdy Gaado Lyrical Video

యంగ్ హీరో సందీప్ కిషన్ తాజా చిత్రం ‘గల్లీ రౌడీ’. ఈ సినిమా నుంచి “విశాఖపట్నంలో రౌడీ గాడో” అనే లిరికల్ వీడియో సాంగ్ ఈరోజు విడుదలైంది. టాలీవుడ్ స్టార్ నితిన్ ఈ సాంగ్ ను రిలీజ్ చేశారు. సాంగ్ బాగుందని అన్న ఆయన చిత్రబృందానికి విషెష్ చెప్పారు. “విశాఖపట్నంలో రౌడీ గాడో” సాంగ్ ను యాజిన్ నాజర్ పాడగా, భాస్కరభట్ల లిరిక్స్ అందించారు. సాంగ్ తో పాటు సినిమాకు సాయి కార్తీక్ సంగీతం అందించారు. ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది.

Read Also : “నీ వల్లే నీ వల్లే” మెలోడీ సాంగ్ రిలీజ్ చేసిన బుట్టబొమ్మ

సందీప్ కిషన్, నేహాశెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘గల్లీ రౌడీ’. బాబీ సింహా, వివా హర్ష, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఎంవివి సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌లపై ఎంవివి సత్యనారాయణ, కోన వెంకట్ నిర్మించారు. సాయి కార్తీక్, రామ్ మిరియాలా ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పటికే ‘గల్లీ రౌడీ’ నుంచి విడుదలైన టీజర్ కు, సాంగ్ కు అద్భుతమైన స్పందన వచ్చింది.

https://www.youtube.com/watch?v=l4DrW6Uh05I
Exit mobile version