NTV Telugu Site icon

Virupaksha: తేజు గురించి డాక్టర్లు ఆ రోజే చెప్పారు: ట్రైలర్ లాంచ్ లో అల్లు అరవింద్

V

V

Sai Dharam Tej: సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా మిస్టీక్ థ్రిల్లర్ విరూపాక్ష. సంయుక్త మీనన్ హీరోయిన్ గా కార్తీక్ దండు దర్శకత్వంలో సీనియర్ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా మంగళవారం మూవీ ట్రైలర్ ను అల్లు అర‌వింద్‌, దిల్ రాజు సంయుక్తంగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ, ”ప్రతి మనిసికి ఓ లైఫ్ జ‌ర్నీ ఉంటుంది. అందులో ప‌డ‌టం, లేవ‌టం అనేది సాధార‌ణం. అలా సాయిధ‌ర‌మ్ తేజ్ లైఫ్ స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతున్న స‌మ‌యంలో దేవుడు యాక్సిడెంట్ రూపంలో చిన్న బ్రేక్ వేశాడు. అయితే త‌ను దాంట్లో నుంచి రిక‌వ‌ర్ అయ్యి చేస్తున్న మొద‌టి సినిమా ‘విరూపాక్ష‌’. ట్రైల‌ర్ చూశాక ‘వాట్ ఎ ట్రైల‌ర్’ అనిపించింది. కొత్త డైరెక్ట‌ర్ కార్తీక్‌, సుకుమార్ డైరెక్ష‌న్‌లో బాపినీడు, ప్ర‌సాద్‌గారి ప్రొడ‌క్ష‌న్‌లో ఓ వేల్యూస్‌తో పాటు ట్రైల‌ర్ చూస్తుంటే గూజ్ బ‌మ్స్ వ‌చ్చాయి. రేపు సినిమా ఎలా ఉండ‌బోతుందో చూపించారు. ఆల్ ది బెస్ట్ టీమ్‌. తేజుకి ఇది రీ ఎంట్రీ. తేజు నిన్న ఫోన్ చేసి ‘సార్‌! నా ఫ‌స్ట్ సినిమా ‘పిల్లా నువ్వు లేని జీవితం’ మీరు అర‌వింద్‌గారే చేశారు. ఇప్పుడు ఇది నా రీ ఎంట్రీలాంటిది. మీరు రావాలి’ అని అన్నాడు. తేజు ఫస్ట్ అనే కాదు.. ఎప్పుడు ఏ సాయం అడిగినా నేను, అరవింద్‌ గారు చేయ‌టానికి రెడీగా ఉంటాం. ట్రైల‌ర్ చాలా బావుంది. ఈ నెల 21న సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా కంటెంట్ క‌నిపిస్తుంది. పెద్ద స‌క్సెస్ అవుతుంది. నైజాం డిస్ట్రిబ్యూట‌ర్ కాబ‌ట్టి ఈ స‌క్సెస్‌లో నేను కూడా ఓ పార్ట్ అవుతాను’’ అని అన్నారు.

నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ ‘‘ఎన్టీఆర్‌గారి వాయిస్ ఓవ‌ర్‌తో ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ అయ్యాయి. త‌ర్వాత జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గారు టీజ‌ర్ లాంచ్ చేశారు. ఇప్పుడు రాజుగారు, అర‌వింద్‌గారు ట్రైల‌ర్‌ను లాంచ్ చేశారు. అన్ని పాజిటివ్‌గానే కుదిరాయి. బాపినీడు అధ్వ‌ర్యంలో చేసిన సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది’’ అని చెప్పారు. సాయిధ‌ర‌మ్ తేజ్ మాట్లాడుతూ ‘‘ఎంతో ప్రేమించి, క‌ష్ట‌ప‌డి చేసిన సినిమా. ఓ మంచి సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ నెల 21 థియేటర్స్‌లో అంద‌రం క‌లుద్దాం. బ్లాక్ బ‌స్ట‌ర్ న్యూస్‌తో మాట్లాడుకుందాం. అంద‌రూ స‌పోర్ట్ చేయండి. అమ్మా… ఈ సినిమా నీకోసం. ఐ ల‌వ్ యు అమ్మ. నేను అడిగిన త‌ర్వాత స‌పోర్ట్ చేయ‌టానికి వ‌చ్చిన‌ నా తొలి సినిమా నిర్మాత‌లు దిల్ రాజు, అర‌వింద్‌గారికి థాంక్స్‌’’ అని అన్నారు. చివరగా అల్లు అర‌వింద్ మాట్లాడుతూ ‘‘తేజు ఫోన్ చేయగానే గీతా ఆర్ట్స్‌లో సినిమా చేస్తానని చెబుతాడ‌నుకుంటే, ట్రైల‌ర్‌ రిలీజ్ కు ర‌మ్మ‌న్నాడు. త‌ను పుట్టిన‌ప్ప‌టి నుంచి నాకు తెలుసు. తేజుకి యాక్సిడెంట్ అయిన‌ప్పుడు త‌న‌కు వెంట‌నే ట్రీట్‌మెంట్ ఇచ్చిన డాక్ట‌ర్స్ ‘తేజుకి ఎక్క‌డా మేజ‌ర్‌ గాయాలు కాలేదు. త‌న‌కేం కాదు.. బ‌తుకుతాడు’ అని 15 నిమిషాల్లో చెప్పారు. త‌ను అక్క‌డి నుంచి లేచి ఇప్పుడు ‘విరూపాక్ష’ సినిమాలో చింపేశాడ‌ని అంద‌రూ అంటుంటే విన‌టానికి చాలా సంతోషంగా ఉంది. ఈ మ‌ధ్య సినిమాల‌కు ట్రైల‌ర్ బ‌ట్టి ఓపెనింగ్స్ వ‌స్తున్నాయి. ఈ మూవీ ట్రైల‌ర్ చూస్తుంటే పిచ్చ రేంజ్‌లో ఓపెనింగ్స్ వ‌స్తాయ‌ని 100% అనిపిస్తోంది. బాపినీడు, ప్ర‌సాద్‌గారితో చాలా కాలంగా జ‌ర్నీ ఉంది. ‘కాంతార’కు చేసిన మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఈ సినిమాకు సంగీతం అందించ‌టం హ్యాపీ. అన్ని క‌లిసొచ్చి ఈ సినిమా ఎక్క‌డో నిల‌బ‌డుతుంది’’ అని అన్నారు.

Show comments