NTV Telugu Site icon

Virushka: ఆఖరికి ప్రియాంక కూడా చూపించేసింది.. మీరెప్పుడు చూపిస్తారయ్యా

Virushka

Virushka

Virushka: సాధారణంగా సినీ తారలు, సెలబ్రిటీల వ్యకిగత విషయాలను తెలుసుకోవాలని అభిమానులకు ఉత్సుకత ఉంటూనే ఉంటుంది. వారి ప్రేమ, పెళ్లి, పిల్లల గురించి తెలుసుకోవడానికి కష్టాలు పడుతూనే ఉంటారు. తారలు కూడా తమ కుటుంబ విషయాలను అభిమానులతో పంచుకోవడం అలవాటుగా మారిపోయింది. పెళ్లి అయిన దగ్గరనుంచి వెకేషన్స్, పిల్లలు పుట్టడం, వారి నగుమోములను అభిమానులకు చూపించి ఆశీర్వదించమని అడగడం చేస్తూనే ఉంటారు. అయితే కొందరు మాత్రం తమ పిల్లల ముఖాలను దాచేస్తున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విరాట్ కోహ్లీ- అనుష్క ముద్దుల తనయ వామిక గురించి.. విరుష్క గారాల పట్టీకి ప్రస్తుతం రెండేళ్లు.. ఇప్పటివరకు చిన్నదాని ఫోటోను అభిమానులకు చూపించిందే లేదు. రేపు.. మాపు అంటూ ఏడాది గడిచిపోయింది. వామిక నడవడం కూడా నేర్చుకుంది.. కానీ, ఆమె ముఖాన్ని ఇప్పటివరకు బయటివారు చూసిందే లేదు.

మొన్న మొన్న పుట్టిన ప్రియాంక చోప్రా డాటర్ మాల్తీ మేరీని కూడా వారు కెమెరా కంటికి కనిపించేలా చేశారు. కానీ, ఇంకా విరుష్క.. ఇంకా తమ కూతురు ముఖాన్ని దాచేస్తు వస్తున్నారు అని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పోనీ.. ఎలాగైనా వామిక ఫోటోలు తీద్దామని ట్రై చేసిన రిపోర్టర్లపై అనుష్క మండిపడింది. వామిక ఫోటోలు తీయొద్దని నిక్కచ్చిగా చెప్పుకొచ్చింది. దీంతో వామిక ముఖం ఎలా ఉంటుందో ఇప్పటివరకు అభిమానులకు తెలియకుండానే పోయింది. గత రెండు రోజుల నుంచి ప్రియాంక కూతురు ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతుండడంతో విరాట్ అభిమానులు ఆఖరికి ప్రియాంక కూడా చూపించేసింది.. మీరెప్పుడు చూపిస్తారన్నా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి వామికతో విరాట్ ఎప్పుడు కనిపిస్తాడో చూడాలి.

Show comments