Site icon NTV Telugu

Pawan Kalyan: ట్యాక్స్ కట్టడానికి పవన్ కళ్యాణ్ రూ.5 కోట్లు అప్పు చేశాడా? వైరల్ అవుతున్న వీడియో

Pawan Kalyan Tax

Pawan Kalyan Tax

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాల్లో… మరోవైపు సినిమాల్లో రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి సారించాలని పవన్‌కు మనసులో ఉన్నా రాజకీయాలు డబ్బులతో ముడిపడి ఉండటంతో ఆయన సినిమాలు కూడా చేస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులతో కౌలు రైతులకు ఆర్ధిక సహాయం అందించారు. దీని కోసం రూ.30 కోట్లను వెచ్చించినట్లు వార్తలు వచ్చాయి. అటు ఇప్పటం గ్రామంలో ప్రభుత్వం రైతుల ఇళ్లను కూల్చివేసిందని ఆరోపిస్తూ పవన్ కళ్యాణ్ నష్టపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి రూ.లక్ష మేర ఆర్ధిక సహాయం అందించి తనలోని గొప్ప మనసు చాటుకున్నారు. అందుకే పవన్‌ను అభిమానులు విపరీతంగా ఆదరిస్తున్నారు. తన అభిమాన నాయకుడిని ఒక్క మాట అన్నా ఊరుకోకుండా వాళ్లను జనసైనికులు ట్రోల్ చేస్తున్నారు.

Read Also: Love Tragedy: లవర్ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని గన్‎తో కాల్చుకున్నాడు

అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఆర్ధిక పరిస్థితికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు వీడియోలో ఓ జనసేన నాయకుడు మాట్లాడుతూ..పవన్ కళ్యాణ్ తాను సంపాదించిన డబ్బులను ప్రజలకు దానం చేసి టాక్సు కట్టడానికి 5 కోట్ల రూపాయిలు అప్పు చేయడం తన కళ్ళతో చూశానని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా పవన్ ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడాలని ఆయన ఆకాంక్షించారు. అయితే పవన్ అప్పు చేయడమేంటని పలువురు అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు ఏ సోషల్ మీడియా చూసినా ఈ వీడియోనే దర్శనమిస్తోంది. పవన్ అప్పు చేసి మరీ పేదలకు సాయం చేస్తున్నారని.. ఆయన్ను చూసి మిగతా రాజకీయ నాయకులు నేర్చుకోవాలని జనసైనికులు హితవు పలుకుతున్నారు. అయితే నిజంగా పవన్ అప్పు చేశారా లేదా అన్న విషయం తెలియాలంటే పవన్ లేదా జనసేన ముఖ్య నేతలు స్పందించాల్సి ఉంది.

https://twitter.com/Hidderkaran/status/1601129057239781376

Exit mobile version