Site icon NTV Telugu

Vikrant Rona: సుదీప్ చిత్రానికి సమర్పకుడిగా సల్మాన్!

Vikranth

Vikranth

పాన్ ఇండియా సినిమాలకు స్టార్స్ పేర్లు జత చేయడం ఇటీవల సర్వ సాధారణమైపోయింది. రణబీర్‌ కపూర్‌, అలియాభట్‌ జంటగా హిందీలో రూపుదిద్దుకుంటున్న ‘బ్రహ్మాస్త్ర’ మూవీకి దక్షిణాదిలో స్టార్ డైరెక్టర్ రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తారని ఆ మధ్య చిత్ర నిర్మాత కరణ్‌ జోహార్ తెలిపారు. అలానే పలు తెలుగు సినిమాలకూ ఆయన ఉత్తరాదిన నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అదే ధోరణిలో కన్నడ చిత్రసీమ కూడా సాగుతోంది. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్‌ నటించిన ప్రతిష్ఠాత్మక త్రీడీ చిత్రం ‘విక్రాంత్ రోణ’ హిందీ వర్షన్ కు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు జాక్ మంజునాథ్‌, శాలిని మంజునాథ్ తెలుపుతూ, చిన్న వీడియోను విడుదల చేశారు. ఇతర భారతీయ భాషల్లోనూ ఎవరెవరు ఈ సినిమాతో ముడిపడబోతోంది త్వరలో తెలియచేస్తామని చెప్పారు.

విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ‘విక్రాంత్ రోణ’లో బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండేజ్, నిరూప్ భండారి, నీతా అశోక్ ప్రధాన పాత్రలు పోషించారు. అనూప్ భండారి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బి. అజనీశ్‌ లోక్ నాథ్ సంగీతం అందించిన ఈ సినిమాకు విలియమ్ డేవిడ్ సినిమాటోగ్రాఫర్. ప్రపంచవ్యాప్తంగా ‘విక్రాంత్ రోణ’ జూలై 28న విడుదల కానుంది. ఇటీవల సుదీప్, అజయ్ దేవ్ గన్ మధ్య జాతీయ భాషకు సంబంధించిన వార్ సోషల్ మీడియాలో జరిగిన నేపథ్యంలో ఈ చిత్రానికి ఉత్తరాదిన ఎలాంటి స్పందన లభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

 

 

Exit mobile version