విశ్వనటుడు కమల హాసన్ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణం రానేవచ్చింది. ఎట్టకేలకు విక్రమ్ తెలుగు ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఖైదీ చిత్రంతో తెలుగు, తమిళ్ లో స్టార్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ మరియు ఆర్ మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.పాన్ ఇండియా సినిమాగా అన్ని భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో ఫాహద్ ఫాజిల్ మరియు విజయ్ సేతుపతి ముఖ్యమైన పాత్రలు పోషిస్తుండగా సూర్య అతిధి పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేశారు. ఇప్పటికే తమిళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కి విశేష స్పందన వచ్చింది. తెలుగు ట్రైలర్ కూడా ఆద్యంతం ఆకట్టుకొంటుంది. “అడవి అన్నాక సింహం, పులి, చిరుత అన్ని వేటకు వెళ్తాయి.. జింక తప్పించుకోవానుకొంటుంది” అంటూ కమల్ బేస్ వాయిస్ తో మొదలైన ట్రైలర్ చివరివరకు ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
ఇక ఇందులో పులి, సింహం, చిరుత ఎవరు.. వారిని విక్రమ్ ఎలా అడ్డుకుంటాడు అనేది కథగా తెలుస్తోంది. ట్రైలర్ లో విజయ్, ఫహద్, కమల్ స్క్రీన్ ప్రజెన్స్ అదిరిపోయింది. ముగ్గురుకు తగినంత స్పేస్ ఇచ్చి ట్రైలర్ కట్ చేసిన తీరు ఆకట్టుకొంటుంది. ముగ్గురూ డిఫరెంట్ లుక్స్ లో కనిపించి.. ఒకే ఇంటెన్స్ ను కొనసాగించారు. లోకేష్ కనగరాజ్ తన పవర్ ఫుల్ పంచ్ లైన్లు మరియు అద్భుతమైన టేకింగ్ తో ప్రత్యేకంగా నిలిచాడు అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఇక ట్రైలర్ కి హైలైట్ అంటే అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పాలి.. ది ఈగల్ ఈజ్ కమింగ్ అంటూ సాగిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అల్టిమేట్ అని చెప్పాలి. జూన్ 3న ఈ సినిమ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తెలుగులో యూత్ స్టార్ నితిన్ తన శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ లో రెండు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో థియేటర్లలో విడుదల చేయనున్నారు.మొత్తానికి ట్రైలర్ తోనే అంచనాలు పెంచేసిన మేకర్స్ సినిమాతో ఎలాంటి రికార్డులు సాధిస్తారో చూడాలి.