NTV Telugu Site icon

Vikram: శివపుత్రుడు లానే తంగలాన్ లో కూడా నాకు డైలాగ్స్ ఉండవు

Vikram

Vikram

Vikram: కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం తంగలాన్.. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పార్వతి, మాళవిక మోహనన్ ఫిమేల్ లీడ్స్ లో నటించారు. కొన్ని వందల ఏళ్ళ క్రితం కథ అని, కోలార్ బంగారు గనుల కార్మికుల జీవిత కథల ఆధారంగా ఈ సినిమాని తీస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా విక్రమ్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే వేరే లెవల్ అని చెప్పాలి. నేడు ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఎంత భయంకరంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు విక్రమ్.. పామును పట్టుకొని చేత్తోనే రెండు ముక్కలుగా చీల్చడం.. అభిమానులకు ఒళ్ళు గగుర్పుడ్చేలా చేసింది అంటే అతిశయోక్తి కాదు. అంత వైల్డ్ గా ఈ సినిమా ఉండబోతుందని డైరెక్టర్ ఒక్క సీన్ తోనే చూపించాడని తెలుస్తోంది.

VarunLav: వరుణ్ – లావణ్య పెళ్లి ఫోటో వచ్చేసిందోచ్

ఇక ఈ సినిమా టీజర్ లాంచ్ వేడుకలో విక్రమ్.. సినిమాకు సంబంధించిన ఒక సీక్రెట్ ను బయటపెట్టాడు. ఈ సినిమా మొత్తంలో విక్రమ్ కు డైలాగ్స్ ఉండవట. ” నాకు తెలుసు తెలుగు అభిమానులకు సినిమాలు అంటే ఎంత పిచ్చో.. శివపుత్రుడు సినిమాను ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారు. అది ఎంతపేరు తెచ్చిపెట్టిందో.. ఈ సినిమా కూడా నాకు అంతే పేరు తెస్తుంది అని నమ్ముతున్నాను. ఈ సినిమాలో నేను మాట్లాడను.. అంతా అరవడమే. శివపుత్రుడు లానే తంగలాన్ లో కూడా నాకు డైలాగ్స్ ఉండవు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విక్రమ్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments