NTV Telugu Site icon

Vikram : ఆగిపోయిన సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన విక్రమ్..

Vikram

Vikram

చియాన్ విక్రమ్.. హిట్లు..ఫ్లాపులకు సంబంధం లేకుండా సాగుతుంది ఈ హీరో కెరీర్. విక్రమ గతేడాది తంగలాన్ అనే సినిమాను రిలీజ్ చేసాడు. విక్రమ్ నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి కానీ ఆశించిన విజయం దక్కించులేదు. ఈ సినిమాతో పాటు ధ్రువ నక్షత్రం, వీర ధీర సూరన్ – 2 అనే రెండు సినిమాలు కూడా చేసాడు. ధ్రువ నక్షత్రం షూటింగ్ ఫినిష్ చేసుకుని మూడేళ్లు అవుతుంది కానీ విడుదలకు మాత్రం నోచుకోలేదు. ఇక వీర ధీర సూరన్ ఇదే పరిస్థితి.

Also Read : Nandamuri Balakrishna : ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రం ‘డాకు మహారాజ్’

యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ఎస్‌‌యు అరుణ్ కుమార్‌తో చేసిన ‘వీర ధీర సూరన్-2’ మొదట సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ గేమ్ ఛేంజర్, బాల డైరెక్షన్‌లో వస్తోన్న‌వనంగాన్, అజిత్ విదాముయర్చి పొంగల్ రేసులోకి వచ్చేయడంతో విక్రమ్ సైడయ్యాడు. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా వస్తోన్న వీర ధీర శూరన్‌లో దుషారా విజయన్ హీరోయిన్. ఎస్ జే సూర్య కీ రోల్ ప్లే చేస్తుండగా మాలీవుడ్ స్టార్ హీరో సూరజ్ వెంజరమూడు కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. జీవీ ప్రకాష్ స్వరాలు సమకూరుస్తోన్న ఈ మూవీ పొంగల్ దంగల్ నుండి తప్పుకుని  జనవరి 24న వచ్చేందుకు ఫిక్సైంది. కానీ ఇప్పడు అక్కడ కూడా రిలీజ్ అడ్డంకులు రావడంతో మరోసారి డేట్ మారింది. ఈ సారి ఏకంగా మరో రెండు నెలలు వెనక్కి వెళుతూ మర్చి 27న వస్తున్నట్టు అధికారకంగా ప్రకటించారు మేకర్స్. కానీ అదే రోజు మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన లుసిఫెర్ సీక్వెల్ ఎంపురన్ నుండి పోటీ ఎదుర్కోనుంది వీర ధీర సూరన్ 2 .