విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం విక్రమ్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుచ్న్హి విడుదలైన పోస్టర్స్, స్పెషల్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, ఆర్ మహేందర్ విక్రమ్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 3 న విడుదల కానుంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను మేకర్స్ తెలిపారు. విక్రమ్ సినిమా ఫస్ట్ గ్లాన్స్ ని బీస్ట్, కెజిఎఫ్ 2 చిత్రాలతో పాటు ప్రదర్శించనున్నారని తెలుపుతూ ఫస్ట్ గ్లాన్స్ ను షేర్ చేశారు. జైల్లో కొంతమంది రౌడీలు ఫైట్ చేస్తూ కనిపించగా.. చివర్లో వారిని కమల్ హాసన్ అడ్డుకుంటున్నట్లు చూపించారు. రెండు ఇనుప షీల్డ్ ల మధ్య కమల్ లుక్ ను రివీల్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది ఇక ఈ చిత్రంలో కమల్ పోలీస్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. గత కొన్నేళ్లుగా హిట్ ని అందుకొని కమల్ ఈ సినిమాతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.
Now witness #Vikram – The first glance along with #Beast & #KGF2 in theaters near you.#VikramFromJune3 #Ulaganayagan#KamalHaasan #50daysforVikram @ikamalhaasan @Udhaystalin @Dir_Lokesh @VijaySethuOffl #FahadhFaasil #Mahendran @anirudhofficial @turmericmediaTM @RedGiantMovies_ pic.twitter.com/enyyCjncfO
— Raaj Kamal Films International (@RKFI) April 13, 2022
