Kalidas Jayaram Engagement Photos goes Viral: సినీ పరిశ్రమలో బ్యాచిలర్లు అందరూ పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. బాలీవుడ్ హీరోయిన్ పరిణితీ చోప్రా ఆప్ ఎంపీని రాజీవ్ చద్దాను వివాహం చేసుకోగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు ఇటలీలో వెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకొచ్చారు. తమిళ నటుడు అశోక్ సెల్వన్, కీర్తి పాండియన్ మెడలో మూడు ముళ్లు వేయగా స్టార్ హీరో అర్జున్ సర్జా పెద్ద కుమార్తె, నటి ఐశ్వర్య అర్జున్.. తమిళ స్టార్ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు ఉమాపతిని ఎంగేజ్ మెంట్ కూడా చేసుకుంది. అలాగే ఇంకోపక్క ఒకప్పటి హీరోయిన్ రాధ కుమార్తె, హీరోయిన్ కార్తీక కూడా తర్వలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఈ క్రమంలో మరో సినీ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతోన్నట్టు అధికారికంగా ప్రకటించారు.
మలయాళ స్టార్ యాక్టర్ జయరామ్ తనయుడు కాళీదాస్ జయరామ్ తన స్నేహితురాలు, మోడల్ తరిణి కళింగరాయర్ తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాళీదాస్..తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తున్నాడు, విక్రమ్ సినిమాలో ఏసీపీ ప్రభంజన్ గా నటించాడు. ఇక ఆయన కాబోయే భార్య తరిణి.. 2021 మిస్ యూనివర్స్ ఇండియాలో 3వ రన్నరప్ గా టైటిల్‌ను గెలుచుకుంది. ప్రస్తుతం ఆమె మోడల్‌గా వ్యవహరిస్తోంది. ఇక ఆయన తండ్రి మలయాళ స్టార్ నటుడైన జయరామ్ పలు తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. అల వైకుంఠపురంలో అల్లు అర్జున్ అసలైన తండ్రి పాత్రలో కనిపించగా ఆ తర్వాత రాథే శ్యామ్, ధమాకా, రవాణాసుర, ఖుషి వంటి సినిమాల్లో నటించారు. మళయాళంలోనే కాక తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేస్తూ బిజీగా మారారు. తండ్రి తరువాత కుమారుడు కాళిదాస్ కూడా.. స్టార్ హీరోగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.