SAM BAHADUR: 365 రోజుల తర్వాత రిలీజ్ కానున్న విక్కీ కౌశల్ సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతున్నాడు. బయోపిక్ సినిమాలు, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో తెరకెక్కే సినిమాలు చేస్తున్న విక్కీ కౌశల్ ఇప్పటికే ‘ఉరి’, ‘సర్దార్ ఉద్ధమ్’ లాంటి చిత్రాలతో మంచి విజయాలు అందుకున్నాడు. మరో బ్లాక్ బస్టర్ కొట్టడానికి, నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ 1న ఆడియన్స్ ముందుకి వస్తాను అంటూ విక్కీ కౌశల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. విక్కీ ప్రస్తుతం నటిస్తున్న ‘సామ్ బహదూర్’ సినిమా షూటింగ్ దశలో ఉంది. ‘మేఘ్నా గుల్జార్’ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ‘సాన్య మల్హోత్ర’, ‘ఫాతిమా సన షేక్’ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ తో ఆకట్టుకున్న ‘సామ్ బహదూర్’ చిత్ర యూనిట్, ఒక వీడియోని రిలీజ్ చేసి 2023 డిసెంబర్ 1న తమ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.
ఇండియన్ మిలిటరీని అయిదు యుద్ధాల్లో, నాలుగు దశాబ్దాల పాటు ముందుండి నడిపించిన “ఫీల్డ్ మార్షల్ సామ్ జంషద్ జీ మానెక్ షా” జీవితం ఆధారంగా ‘సామ్ బహదూర్’ సినిమా తెరకెక్కుతోంది. ‘బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ’ నుంచి సైన్యంలోనే ఉన్న ‘సామ్ బహదూర్’, 1971లో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో ఇండియాని గెలిపించడంలో ముఖ్య పాత్ర పోషించారు. 9 బుల్లెట్లు శరీరంలో దిగినా యుద్ధంలో వెనకడుగు వేయని ‘సామ్ బహదూర్’ని ఇండియన్ గవర్నమెంట్ ‘పద్మ భూషణ్’, ‘పద్మ విభూషణ్’ పురస్కారాలతో సత్కరించింది. 1934 నుంచి 1973 వరకూ దేశ రక్షణలో ఉన్న ‘సామ్ బహదూర్’ 2008 జూన్ 27న మరణించారు. ఇలాంటి వ్యక్తి కథతో సినిమా చేయడం అంత ఈజీ కాదు. మరి విక్కీ కౌశల్ అండ్ టీం ‘సామ్ బహదూర్ సినిమాని’ ఎంత స్పెషల్ గా రూపొందించారో తెలియాలి అంటే 2023 డిసెంబర్ 1 వరకూ ఆగాల్సిందే.
Also Read
తాజావార్తలు
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!