Site icon NTV Telugu

JSJ : డైరెక్టర్ గా విజయ్ కొడుకు జాసన్ సంజయ్.. టైటిల్ పోస్టర్ రీలీజ్

Jsj

Jsj

తమిళ స్టార్ హీరో విజయ్ కుమారుడు డైరెక్టర్ గా వెండితెర అరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. టోర్నడాలోని ఓ ఫిల్మ్ స్కూల్లో నేర్చుకున్న విద్య, గతంలో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసిన ఎక్స్ పీరియన్స్‌తో కోలీవుడ్ లో డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు.  ఫస్ట్ మూవీలో తెలుగు హీరో సందీప్ కిషన్‌ను హీరోగా ఎంచుకున్నాడు. రీసెంట్లీ సందీప్ బర్త్ డే సందర్భంగా ఓ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు.

Also Read : KRAMP : సెకండ్ ఇన్నింగ్స్ లో సూపర్ హిట్ అందుకున్న సీనియర్ బ్యూటీ

కాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను నేడు రిలీజ్ చేసారు మేకర్స్. ఈ సినిమాకు SIGMA అనే టైటిల్ ఫిక్స్ సందీప్ కిషన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. గిల్డ్ బిస్కెట్స్, డబ్బుల కట్టలు గుట్టగా పోసి వాటిపై సందీప్ కిషన్ కూర్చున్న పోస్టర్ ను రిలీజ్ చేసారు. తండ్రి విజయ్ స్టార్ హీరో అయినప్పటికీ జాసన్ పూర్తిగా దర్శకత్వంపైనే కాన్సట్రేషన్ చేస్తున్నాడు. క్లిక్ అయితే ఓకే కానీ  దర్శకుడిగా బిగ్ ఫ్యాన్ బేస్ సంపాదించడం కష్టమే. అలాగే హీరో అయిపోతే సరిపోదు.. ప్రేక్షకుల మెచ్చే హీరో కావాల్సి ఉంటుంది. అప్పుడే తండ్రి చరిష్మాను రిపీట్ చేయగలడు.  ప్రస్తుతం డైరెక్షన్‌కే ఇంపార్టెన్స్ ఇస్తోన్న జానన్ ఫ్యూచర్‌లో హీరో అవుతాడేమో చూడాలి. బడా చిత్రాల నిర్మాణ సంస్థ  లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను త్వరగా షూటింగ్ ఫినిష్ చేసి వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందకు తీసుకురానున్నారు మేకర్స్.

Exit mobile version