Thalapathy Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్.. ఈ మధ్యనే లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళ్ లో మంచి విజయాన్నే అందుకున్నా.. తెలుగులో మాత్రం మిక్స్డ్ టాక్ అందుకుంది. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ ను శుక్రవారం గ్రాండ్ గా నిర్వహించారు. అయితే.. లియో సక్సెస్ తరువాత విజయ్ హాస్పిటల్ లో కనిపించడం షాకింగ్ కు గురిచేస్తోంది. విజయ్ ఒక హాస్పిటల్ లోపలి నుంచి వస్తున్న ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక ఈ వీడియో చూసిన తలపతికి ఏమైంది అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Mrunal Thakur: పాపం.. సీత.. అల్లు అరవింద్ మాటలకు బాగా హార్ట్ అయినట్టు ఉంది
ఇకపోతే అందుతున్న సమాచారం ప్రకారం.. విజయ్ కు ఏమి కాలేదని, ఆయన పూర్తిగా ఉన్నారని సన్నహితులు చెప్పుకొస్తున్నారు. ఆయన హాస్పిటల్ కు వెళ్ళింది.. విజయ్ మక్కల్ ఇయక్కం (VMI) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బుస్సీ ఆనంద్ ను పరామర్శించడానికి తెలుస్తోంది. విపరీతమైన అలసట కారణంగా, అతను ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ఇక ఈ విషయం తెలుసుకున్న విజయ్.. నేటి ఉదయం చెన్నెలో ఉన్న హాస్పిటల్ కు వెళ్లి.. ఆనంద్ ను పరామర్శించి వచ్చాడట. ఇక అనంతరం తలపతి.. తన తదుపరి చిత్ర షూటింగ్ కోసం బ్యాంకాక్ పయనమయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. లియో తరువాత విజయ్.. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో విజయ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.