Site icon NTV Telugu

Kattappa: బాహుబలిలో కట్టప్ప పాత్ర మిస్ చేసుకున్న స్టార్ హీరో.. లీక్ చేసిన విజయేంద్రప్రసాద్

Bahubali

Bahubali

Vijayendraprasad Reveals Bahubali Story Origin: బాహుబలి సినిమా ఎంతగా తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఎంత పేరు తెచ్చేలా చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ బాహుబలి సినిమా ఇండియన్ సినీ హిస్టరీని రికార్డులను మార్చేసింది. ఇక ఆ తరువాత వచ్చిన బాహుబలి 2 ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసి ఆర్ఆర్ఆర్ వచ్చే దాకా హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇక బాహుబలి 2 ఇప్పటికీ ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఉందని అంటే దాని సత్తా ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఇక తాజా ఇంటర్వ్యూలో బాహుబలి కథకు బీజం ఎలా పడిందో రచయిత విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చాడు. ఒక రోజు జక్కన్న పిలిచి ప్రభాస్ కోసం కథ కావాలి, అది స్త్రీ, పురుషులకు సమాన ప్రాధాన్యత ఉన్న యాక్షన్ సబ్జెక్టు కావాలని అడిగాడట. అప్పుడు విజయేంద్ర ప్రసాద్ కట్టప్ప పాత్ర గురించి చెప్పగా జక్కన్న బాగా ఎగ్జయిట్ అయ్యాడట.

Aishwarya Shankar: భర్తతో విడాకులు.. ఇప్పుడు తండ్రి అసిస్టెంట్ తో శంకర్ కూతురి ఎంగేజ్మెంట్

కత్తి సాములో యోధుడైన ఒక వృద్ధుడు యువకులకు నేర్పుతుండగా ఒక విదేశీయుడు వస్తాడు, మాటల మధ్యలో బాహుబలి ప్రస్తావన రాగా బాహుబలి చేతిలో కత్తి ఉన్నంత వరకు అతన్ని ఎవరూ చంపలేరని విదేశీయుడికి చెబుతాడట. ఆ వీరుడిని కలవాలని విదేశీయుడు ఆశ పడితే ఆ వీరుడు ఇప్పుడు బ్రతికి లేడని ఆయుధం కంటే పదునైన వెన్నుపోటుతో అతన్ని నేనే చంపానని చెబుతాడు. ఈ అంశం చుట్టూ కథ రాసుకోమని రాజమౌళి కోరాడట. అయితే రాసుకునే సమయంలో కట్టప్ప పాత్ర సంజయ్ దత్ ని దృష్టిలో ఉంచుకుని రాశానాని కానీ ఆయన చేయడం కుదర్లేదు కాబట్టి సత్య రాజ్ ని ఎంచుకున్నామని విజయేంద్ర వర్మ ఆనాటి విషయాలు ఇప్పుడు లీక్ చేశారు. అంటే కట్టప్ప అనే పాత్రను బట్టే బాహుబలి ఫ్రాంచైజ్ నిర్మితమైంది. ఇక ఈ పాత్ర చేసినందుకు సత్యరాజ్ కి మంచి ఫేమ్ వచ్చింది.

Exit mobile version