RRR: సీక్వెల్ రెడీ.. క్లారిటీ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాహుబలి చిత్రంతో టాలీవుడ్ ను పాన్ ఇండియా లెవల్లో నిలబెట్టిన డైరెక్టర్ రాజమౌళి. ఇక బాహుబలి పార్ట్ 1 లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నతో ఎండ్ చేసి బాహుబలి 2 కోసం ఎంతగానో ఎదురుచూసేలా చేసిన క్రెడిట్ రాజమౌళికి ఎంత ఉందో, అయన తండ్రి, రైటర్ విజేయద్రప్రసాద్ కు కూడా అంతే ఉంది. ఫాంటసీ, చరిత్ర కథలను రాయడంలో విజయేంద్ర ప్రసాద్ దిట్ట. ఇక ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన ఆర్ఆర్ఆర్ కథ కూడా ఆయన కలం నుంచి జారువారిందే. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలను ఉహించుకొని వారి పోరాట ప్రతిభను తట్టిలేపి.. ఒక అద్భుతానికి ఆజ్యం పోశారు . ఇక ఎప్పుడూ చూడలేని ఒక స్టార్ కాంబోను తెరపై అభిమానులు చూసేలా చేశారు. అయితే తాజాగా మరో అద్భుతానికి విజయేంద్ర ప్రసాద్ తెరలేపనున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమాకు సీక్వెల్ ప్రకటించి అభిమానులకు తీపి కబురు చెప్పారు. గతరాత్రి దిల్ రాజు ఆధ్వర్యంలో ఆర్ఆర్ఆర్ సక్సెస్ పార్టీ జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ పలు ఇంటర్వ్యూలో “ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎన్టీఆర్ మతాల మధ్యలో ఆర్‌ఆర్‌ఆర్ సీక్వెల్ గురించి అడిగాడని, నేను కొన్ని ఐడియాలను చెప్పాను. అవి ఎన్టీఆర్, రాజమౌళికి బాగా నచ్చాయి. దేవుడి దయ ఉంటే భవిష్యత్తులో సీక్వెల్ రావొచ్చు” అని చెప్పిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ వేడుకలో సీక్వెల్ ఉండనున్నదని, త్వరలోనే కథను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. బాహుబలి లానే ఈ సినిమా కూడా ఫ్రాంచైజీగా ఉండనున్నదని తెలిపారు. ఇక ఈ వార్త తెలియడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవని తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Tags
- latest news
- ntr
- rajamouli
- Ram Charan
- rrr
తాజావార్తలు
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!