Vijayashanti: నటించాలని లేదు కానీ.. విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు!
- 'కర్మాఖ్య' సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం
- లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు
- చిన్న సినిమాలకు అండగా నిలవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిన్న సినిమాలకు ప్రేక్షకులు, మీడియా నుంచి మరింత ప్రోత్సాహం అవసరమని ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి అన్నారు. మంచి కథలు, కొత్త ఆలోచనలతో వచ్చే చిన్న చిత్రాలకు తగిన గుర్తింపు లభిస్తే.. తెలుగు సినీ పరిశ్రమ మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు. పెద్ద సినిమాలతో పోలిస్తే చిన్న చిత్రాలకు తక్కువ సపోర్ట్ లభిస్తోందని, కానీ చిన్న సినిమాల్లోనే దమ్ము ఉంటుందని విజయశాంతి పేర్కొన్నారు. ‘కర్మాఖ్య’ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న విజయశాంతి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రానికి అదిరే అభి (అభినయ కృష్ణ) దర్శకత్వం వహించారు. జూలై 31న కర్మాఖ్య సినిమా విడుదల కానుంది.
‘పెద్ద సినిమాలతో పోలిస్తే చిన్న చిత్రాలకు తక్కువ సపోర్ట్ లభిస్తోంది. అయితే చిన్న సినిమాల్లోనే దమ్ముంటుంది. కొత్తదనం, బలమైన కథలు, ప్రతిభ దాగి ఉంటాయి. ప్రేక్షకులు ఇలాంటి చిత్రాలను ఆదరిస్తే మరింత మంది కొత్త దర్శకులు, నటీనటులు పరిశ్రమకు వస్తారు. చిన్న సినిమా నిర్మాతలకు మీడియా సహకారం ఎంతో అవసరం. కొత్త కథలు, వినూత్న ఆలోచనలతో వచ్చే చిత్రాలు ప్రేక్షకుల దృష్టికి వెళ్లాలంటే మీడియా కీలక పాత్ర పోషించాలి. ప్రారంభ దశలో మీడియా అండ ఉంటే చిన్న సినిమాలు కూడా పెద్ద విజయాలు సాధించగలవు’ అని లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పేర్కొన్నారు.
Also Read
- Jeetendra: 4 లక్షల పెట్టుబడితో 450 కోట్ల జాక్‌పాట్ కొట్టిన నటుడు... అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Land Grab Case: జూబ్లీహిల్స్‌లో భూ కబ్జా యత్నం.. ఇద్దరు ప్రముఖ సినీ నిర్మాతలపై కేసు నమోదు!
- Romanchakam: ప్రేమలో మునిగిపోయే మెలోడీ.. 'రొమాంచకం' నుంచి 'రాధా రమణ' పాట రిలీజ్!
- RAW NTR: ఊహించని ట్విస్ట్.. 'రా ఎన్టీఆర్'కు గుడ్‌బై.. అసలు ఏమైంది?
‘కర్మాఖ్య సినిమా కోసం నటి అభినయ గుండు చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఆమె చేసిన అంకితభావానికి ప్రేక్షకులు తప్పకుండా ఆదరణ చూపిస్తారు. సినిమా విజయం ద్వారా ఆ కష్టానికి సరైన గుర్తింపు లభిస్తుంది. ప్రస్తుతం ఏ ప్రాంతం నుంచి వచ్చిన హీరోయిన్ అయినా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ప్రతిభకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్న తెలుగు ప్రేక్షకుల ఆదరణ వల్లే తెలుగు సినిమా పరిశ్రమ మరింత విస్తరిస్తోంది. ప్రస్తుతం నేను రాజకీయాల్లో బిజీగా ఉన్నాను. అందుకే నటించే ఆలోచన లేదు. బలమైన కథ, ఆకట్టుకునే మంచి పాత్ర వస్తే మాత్రం తప్పకుండా ఆలోచిస్తా’ అని విజయశాంతి వెల్లడించారు.
తాజావార్తలు
-
Vijayashanti: నటించాలని లేదు కానీ.. విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్‌కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Yuvraj Singh: 2027 వరల్డ్‌కప్‌కు యువరాజ్ జట్టు ఇదే.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు దక్కని చోటు!
ట్రెండింగ్
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!