Site icon NTV Telugu

Vijayashanthi: స్టైలిష్ లుక్ లో రాములమ్మ.. ఎన్నాళ్లకు చూశాం

Vijaya

Vijaya

Vijayashanthi: ఇప్పుడంటే అనుష్క, నయనతార, సమంత లాంటివారిని లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తున్నాం కానీ, అప్పట్లో లేడీ సూపర్ స్టార్ అంటే ఒక్కరే .. ఆమె విజయశాంతి. హీరోలకు ధీటుగా ఆమె సినిమాలు రిలీజ్ అవ్వడమే కాదు.. హిట్లు కూడా అందుకొనేవి. ఒకానొక సమయంలోనే విజయశాంతి సినిమా రిలీజ్ అంటే.. కొంతమంది హీరోస్ తమ సినిమాలను కూడా ఆపుకొనేవారట. అంతలా ఇండస్ట్రీని ఏలిన విజయశాంతి.. సినిమాలకు పూర్తిగా బ్రేక్ ఇచ్చి.. పాలిటిక్స్ లో చేరింది. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ తరుపున ప్రచారం చేస్తుంది. ఇక రాజకీయాలు, సినిమాలు అంటూ రెండు పడవల మీద కాలు వేయకుండా.. సినిమాలను వదిలి రాజకీయాల్లోనే ఉండిపోయింది. ఇక చాలా గ్యాప్ తరువాత అనే సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. మహేష్ బాబు, రష్మిక జంటగా నటించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

Mansoor Ali Khan: మన్సూర్ కు షాక్ ఇచ్చిన కోర్ట్.. బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదు

ఇక నేడు దర్శకుడు అనిల్ రావిపూడి పుట్టినరోజు కావడంతో విజయశాంతి.. ట్విట్టర్ వేదికగా అనిల్ రావిపూడికి బర్త్ డే విషెస్ తెలిపింది. ” పుట్టినరోజు శుభాకాంక్షలు అనిల్ రావిపూడి గారు. మీ జీవితంలో విజయం, సంతోషం ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను” అని రాసుకొచ్చింది. దీంతో పాటు.. అనిల్ తో పాటు కలిసి దిగిన ఫోటోను కూడా షేర్ చేసింది. సరిలేరు నీకెవ్వరు సెట్ లో దిగిన ఫోటో అని తెలుస్తోంది. ఇందులో రాములమ్మ స్టైలిష్ లుక్ లో కనిపించింది. సినిమాలకు గ్యాప్ ఇచ్చిన తరువాత.. ఆమె రాజకీయాల్లో నిత్యం చీరలు, డ్రెస్ లతోనే కనిపించింది. చాలా ఏళ్ళ తరువాత ఆమె ఇలా మోడ్రన్ లుక్ లో కనిపించింది. ప్యాంట్, షర్టు.. గాగుల్స్ పెట్టుకొని అనిల్ తో ఫోజ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. స్టైలిష్ లుక్ లో రాములమ్మ.. ఎన్నాళ్లకు చూశాం అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version