NTV Telugu Site icon

Vijayashanthi: ఆయనకి కూడా ఇస్తే తెలుగు జాతి పులకించిపోయేది.. ‘భారతరత్న’పై విజయశాంతి కామెంట్స్

Vijayashanthi

Vijayashanthi

Vijayashanthi Comments on Bhrathratna to PV Narasimha Rao: తెలుగు రాష్ట్ర నేత, దేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం ‘భారతరత్న’ పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. పీవీ నరసింహారావుకు ‘భారతరత్న’ పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. లేట్ గా అయినా.. ఆయనకు సముచిత గౌరవం లభించింది అని అనేక వర్గాల నుంచి కామెంట్ వినిపిస్తున్న వేళ తాజాగా ఈ విషయంలో స్పందించిన కాంగ్రెస్ నాయకురాలు, సినీ నటి విజయశాంతి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతుంది. పీవీకి భారత రత్న ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది అంటూనే ఆత్మగౌరవ విజయకేతనమైన పద్మశ్రీ ఎన్టీఆర్‌కు కూడా భారతరత్న ప్రకటించి ఉంటే యావత్ తెలుగు ప్రజానీకం మరింత పులకించిపోయేదని ఆమె పేర్కొన్నారు.

Pawan Kalyan Tour: ఈ నెల 14 నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్‌ పర్యటన

ఈ మేరకు ఎన్టీఆర్ తో కలిసి ఉన్న ఫోటో షేర్ చేసిన ఆయన భారతరత్న వంటి అత్యున్నత అవార్డుల విషయంలో రాజకీయాల ప్రమేయం ఉండక పోవచ్చు కానీ, తెలుగుజాతి గౌరవ ప్రతీక శ్రీ పీవీ నరసింహా రావు గారిని వరించిన పురస్కారం మన ఆత్మగౌరవ విజయకేతనమైన పద్మశ్రీ ఎన్టీఆర్ గారికి కూడా ప్రకటించి ఉంటే తెలుగు ప్రజానీకం యావత్తు మరింత పులకించిపోయేదన్నది తిరుగులేని వాస్తవం. ఈ అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకు వెళ్ళగలిగే అవకాశం ఈ రోజు నిండుగా, మెండుగా కనబడుతోంది. ఈ బాధ్యతను భుజాలకెత్తుకొని, అందరి సంకల్పాన్ని సిద్ధింపజేసే ప్రయత్నం తప్పక జరిగి తీరగలదని త్రికరణశుద్ధిగా నమ్ముతున్నాను. అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని బలపరుస్తారని కూడా నేను నమ్మడం అతిశయోక్తి కాదన్నది నా నిశ్చితాభిప్రాయం అని విజయశాంతి రాసుకొచ్చారు.

Show comments