Site icon NTV Telugu

Vijayashanti : వాళ్లు కూడా బతకాలి కదా.. ఆ హీరోయిన్లపై విజయశాంతి కామెంట్

Vijayashanti

Vijayashanti

Vijayashanti : టాలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ అనే పేరు వినగానే అందరికీ ఎవరు గుర్తుకు వస్తారు.. అంటే ఇప్పుడు చాలా మంది పేర్లు వినిపిస్తాయి. కానీ ఈ బిరుదు పుట్టిందే విజయశాంతితో. అప్పట్లో ఆమెకు మాత్రమే ఈ బిరుదు ఉండేది. హీరోలతో సమానంగా యాక్షన్ సీన్లు చేస్తూ ఆమె ఈ బిరుదు సంపాదించుకుంది. అయితే ఆమె తర్వాత ఈ ట్యాగ్ చాలా మంది హీరోయిన్లు పెట్టేసుకున్నారు. దానిపై తాజాగా విజయశాంతి స్పందించింది. నేను సినిమాల్లో కష్టపడి ఎదిగాను. ఎన్నో సినిమాల్లో యాక్షన్ సీన్ల తర్వాత నాకు ఆ ట్యాగ్ దక్కంది. ప్రతిఘటన సినిమా తర్వాత నుంచి లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ ఇచ్చారు ప్రేక్షకులు. నేను సినిమాల్లో అదే ట్యాగ్ తో అప్పట్లో యాక్టింగ్ చేశాను.
Read Also : Sunitha: ప్రవస్తిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు చేశా.. మా గురించి చర్చించే స్థాయికి ఎదిగింది!

తర్వాత కాలంలో నేను సినిమాల్లో లేను. ఆ టైమ్ లో కొందరు హీరోయిన్లు దాన్ని వాళ్ల పేర్ల ముందు పెట్టుకున్నారు. వాళ్లు కూడా బతకాలి కదా. అందుకే నేను దాన్ని పట్టించుకోలేదు. ప్రేక్షకులకు నేను ఏంటో తెలుసు. అందుకే ఇప్పటికీ నన్ను ఆదరిస్తున్నారు’ అంటూ చెప్పుకొచ్చింది విజయశాంతి. ఆమె నటించిన అర్జున్ సన్నాఫ్‌ వైజయంతి మూవీ థియేటర్లలో ఆడుతోంది. కల్యాణ్‌ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా మంచి టాక్ తో ఆడుతోంది.

Exit mobile version