Vijayakanth Health Update by Premalatha Vijayakanth: తమిళ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ ఆరోగ్యంగా ఉన్నారట. ఆయన పరిస్థితి విషమంగా వుందన్న వార్తలను ఖండించిన భార్య ప్రేమ లత విజయకాంత్ తో వున్న పిక్స్ విడుదల చేసి ఆ విషయాన్ని వెల్లడించారు. ‘విజయకాంత్ క్షేమంగా ఉన్నారు, రెండు రోజుల్లో మీకు శుభవార్త వస్తుంది. విజయకాంత్ అతి త్వరలో తిరిగి బయటకు రానున్నారు. ఆయన తప్పకుండా వచ్చి అందరినీ కలుస్తారని చెప్పారు’’ అని ప్రేమలత విజయకాంత్ అన్నారు. ఈ సందర్భంగా ఆమె విడుదల చేసిన వీడియోలో ‘‘2 రోజుల క్రితం నేను ఇలాంటి వీడియో విడుదల చేశాను, విజయకాంత్ బాగానే ఉన్నారు. తప్పుడు వదంతులు ప్రచారం చేయవద్దని కోరుతున్నా’’’అని అన్నారు. ఆయనకు ట్రాకియోస్టోమీ అని, వెంటిలేటర్ పెట్టారని, కృత్రిమ శ్వాసక్రియ చేశారని, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విజయకాంత్‌ను కలిశారని, నన్ను ఓదార్చారని యూట్యూబ్ ఛానెల్స్, ఛానళ్లు తప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Telangana Elections Counting: మరికాసేపట్లో మొదలవనున్న ఎన్నికల కౌంటింగ్.. నరాలు తెగే ఉత్కంఠ
ఈ పుకార్లు పార్టీ కార్యకర్తలు, నిర్వాహకులు, మా కుటుంబాలు, బంధువులు, సినీ పరిశ్రమకు తీవ్ర మనోవేదన కలిగిస్తున్నాయని ఆమె అన్నారు. ఇక్కడ మేము విజయకాంత్‌తో ఆసుపత్రిలో ఉన్నాము కానీ, ఈ అనారోగ్యం పుకార్లు మాత్రం తిరుగుతూనే ఉన్నాయని ఆమె అన్నారు. మానవత్వంతో ఆలోచించి దయచేసి ఈ పుకార్లు వ్యాప్తి చేయడం ఆపండి, విజయకాంత్ బాగానే ఉన్నారు. రెండు రోజుల్లో మీకు శుభవార్త వస్తుంది. విజయకాంత్ త్వరలో ఆరోగ్యంతో రానున్నారు. ఆయన తప్పకుండా వచ్చి అందరినీ కలుస్తారు. పనికిమాలిన పుకార్లును నమ్మవద్దని అన్నారు. ఈరోజు నా రెండో కుమారుడు షణ్ముగ పాండియన్ విజయకాంత్‌ను కలిసిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నా దయచేసి ఇప్పుడు అయినా ఈ తప్పుడు వార్తలను ఎవరూ నమ్మవద్దని ఆమె అన్నారు.
கேப்டன் ஆரோக்கியமாக இருக்கிறார்.
வெகு விரைவில் கேப்டன் நல்ல உடல் நலத்துடன் வீடு திரும்புவார், நம் அனைவரையும் சந்திப்பார்.
யாரும் வதந்திகளை பரப்பவும் வேண்டாம், நம்பவும் வேண்டாம்! என்று அன்போடு கேட்டுக்கொள்கிறேன்.– திருமதி. பிரேமலதா விஜயகாந்த். pic.twitter.com/sbzd0FDOX4
— Vijayakant (@iVijayakant) December 2, 2023