Vijaya Shanthi: టాలీవుడ్ సీనియర్ నటి విజయశాంతి ప్రస్తుతం రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న విషయం విదితమే. సినిమాలు బ్రేక్ ఇచ్చిన విజయశాంతి తన పూర్తి సమయాన్ని రాజకీయాలకే అంకితం చేసింది. ఇక ఇటీవలే సరిలేరు నీకెవ్వరు చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ పాత్ర కూడా అనిల్ చెప్పిన విధానం, మహేష్ బాబు తో ఉన్న అనుబంధంతోనే ఒప్పుకున్నానని చెప్పుకొచ్చింది. ఈ సినిమా తరువాత మళ్లీ సినిమాల్లో కనిపించబోయేది కూడా లేదని తెలిపింది. అయితే తాజాగా విజయశాంతి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వస్తున్న ఎన్టీఆర్ 30 లో విజయశాంతి ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఈ సినిమాలో చేయడానికి కారణం కూడా లేకపోలేదని చెప్పుకొస్తున్నారు. అదేంటంటే.. ఇటీవలే బీజేపీ నేత అమిత్ షా- ఎన్టీఆర్ తో భేటీ అయిన విషయం విదితమే. బీజేపీనే ఎన్టీఆర్ ను అభినందించింది కాబట్టి తాను కూడా ఎన్టీఆర్ సినిమాలో చేస్తే బావుంటుందని ఆమె అభిప్రాయపడడంతో పాటు పాత్ర కూడా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఎన్టీఆర్- విజయశాంతి మధ్య ఒక పవర్ ఫుల్ సీన్ పడితే థియేటర్లో మోత మోగిపోవడం ఖాయమని అభిమానులు చెప్పుకోస్తున్నారు. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.