Site icon NTV Telugu

Vijay varma : తమన్నా పై నాకు పిచ్చ ప్రేమ వుంది..

Whatsapp Image 2023 07 14 At 10.36.21 Pm

Whatsapp Image 2023 07 14 At 10.36.21 Pm

మిల్కీ బ్యూటీ తమన్నా మరియు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ప్రేమలో ఉన్నట్లు వారు స్వయంగా తెలిపిన విషయమే తెలిసిందే. వీరిద్దరు కలిసి ఇటీవల లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో నటించారు.. ఈ వెబ్ సిరీస్ చిత్రీకరణ సమయంలో తమన్నా విజయ్ వర్మ మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారినట్లు సమాచారం.అలాగే ఈ సిరీస్ ప్రమోషన్లలో పాల్గొన్న తమన్నా ఎవరినైనా ప్రేమించాలంటే వాళ్ల తో ఉంటే సంతోషంగా ఉంటామనే ఫీలింగ్ కలగాలని విజయ్ వర్మ తో తనకు అలాంటి ఫీలింగ్ ఏర్పడింది అని ఆమె చెప్పుకొచ్చింది. తన జీవితం లో విజయ్ వర్మ ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి అని.. అతను తనను ఎప్పటికీ జాగ్రత్తగా చూసుకుంటాడనే నమ్మకం ఉందని తమన్నా తెలిపింది.అయితే కొంతమంది వారు నిజంగా రిలేషన్ లో లేరని కేవలం లస్ట్ స్టోరీస్ 2 ప్రమోషన్స్ కోసమే రిలేషన్ లో ఉన్నామని చెప్పుకొచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు.

అయితే తాజాగా తమ ప్రేమ విషయాన్ని బహిరంగం గా బయటపెట్టారు విజయ్ వర్మ. తమన్నాతో నేను పిచ్చిగా ప్రేమలో ఉన్నాను అని ఆయన తెలిపారు.. ఇటీవలే జీక్యు కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తమ రిలేషన్ షిప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు విజయ్ వర్మ.ప్రస్తుతం మేము ఒకరితో ఒకరు డేటింగ్ చేస్తున్నామని ఇప్పుడు మాకు బాగా అర్థమైంది. నేను ఆమె తో ఎంతో సంతోషంగా ఉన్నాను. అలాగే ఆమె తో పిచ్చిగా ప్రేమ లో ఉన్నాను. ఆమె రాకతో నా జీవితంలో విలన్ దశ ముగిసిపోయింది. ఇప్పుడు రొమాంటిక్ దశ ప్రారంభం అయింది అంటూ చెప్పుకొచ్చారు విజయ్ వర్మ..ప్రస్తుతం విజయ్ వర్మ చేసిన కామెంట్స్ బాగా వైరల్ గా మారాయి. విజయ్ వర్మ చేసిన వ్యాఖ్యలతో ఇప్పటి వరకు వీరిద్దరి ప్రేమ పై వున్న అనుమానాలు అన్నీ తీరిపోయినట్లు తెలుస్తుంది.ప్రస్తుతం తమన్నా వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వుంది.

Exit mobile version