NTV Telugu Site icon

Tamannaah Bhatia: తమన్నాతో డేటింగ్.. ఫోటో ప్రూఫ్‌తో విజయ్ క్లారిటీ

Vijay Varma On Tamannah Dat

Vijay Varma On Tamannah Dat

Vijay Varma Gives Clarity On Dating Rumours With Tamannaah: మిల్కీబ్యూటీ తమన్నా, విజయ్ వర్మ కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారనే వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే! ఒక ఈవెంట్‌లో వీళ్లిద్దరు జంటగా కనిపించినప్పటి నుంచి.. ఈ ప్రచారం ఊపందుకుంది. ఇక గోవాలో జరిగిన కొత్త సంవత్సరం వేడుకల్లో విజయ్‌ని తమన్నా ముద్దు పెడుతున్న వీడియో వైరల్ అయ్యాక.. వీళ్లు ప్రేమలో మునిగితేలుతున్నారని అందరూ ఫిక్సైపోయారు. ఆ తర్వాత ముంబై ఎయిర్‌పోర్ట్‌లో, అనంతరం ఓ అవార్డ్ ఫంక్షన్‌లో ఇద్దరూ కలిసి సందడి చేయడం చూసి.. అధికారికంగా ప్రకటించకపోయినా.. పరోక్షంగానే తాము డేటింగ్‌లో ఉన్నామని వీళ్లు క్లారిటీ ఇచ్చేశారని అభిప్రానులు ఫిక్స్ అయ్యారు.

Villagers attack on police: జల్లికట్టులో యువకుడు మృతి.. పోలీసులపై గ్రామస్తుల దాడి, టెన్షన్‌

పైగా.. ఈ వార్తలను ఆ ఇద్దరు ఖండించకపోవడంతో విజయ్, తమన్నా ప్రేమలో ఉన్నారన్న వార్తలకు మరింత బలం చేకూరింది. ఏదో ఒక రోజు వీళ్లిద్దరు తప్పకుండా తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తారని భావించారు. ఎట్టకేలకు అందరూ అనుకున్నట్టుగానే విజయ్ వర్మ ఈ రూమర్స్‌పై స్పందించాడు. అయితే.. తాము ప్రేమలో ఉన్నామని కాదులెండి, తామిద్దరు ప్రేమించుకోవట్లేదని విషయాన్ని వెల్లడించారు. డేటింగ్ రూమర్స్ నేపథ్యంలో.. లంచ్ డేట్ కోసం విక్రమ్, తమన్నా కలిశారని ఒక వెబ్‌సైట్ రాసిన వార్తకు బదులిస్తూ.. తామిద్దరం డేటింగ్‌లో లేమని తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చాడు. తన రాబోయే ప్రాజెక్ట్ ‘ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్’ డైరెక్టర్ సుజోయ్ ఘోష్‌తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. ‘‘ఇదే నా అసలు లంచ్ డేట్’’ అని పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

Teacher Robbery: తోటి ఉద్యోగినికి బూతు మెసేజ్‌లు.. ఆపై చోరీ..

కాగా.. ప్రస్తుతం తమన్నా, విజయ్ కలిసి ‘లస్ట్ స్టోరీస్ 2’ వెబ్ సిరీస్ చేస్తున్నారు. బహుశా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్‌లో భాగంగానే.. వీళ్లిద్దరు సన్నిహితంగా మెలుగుతున్నట్టు అర్థమవుతోంది. ఆ ఆంథాలజీని డైరెక్ట్ చేస్తోన్న దర్శకుల్లో సుజోయ్ ఘోష్ కూడా ఒకరు. ఇందులో మృనాల్ ఠాకూర్ కూడా నటిస్తోంది. ఆమె అంగద్ బేడీ సరసన జోడీ కట్టింది. ఈ వెబ్ సిరీస్ ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న విషయంపై సరైన క్లారిటీ లేదు కానీ, ఈ ఏడాది ఫస్ట్ క్వార్టర్‌లోనే రావొచ్చని బాలీవుడ్ మీడియా పేర్కొంటోంది. లస్ట్ స్టోరీస్ సీజన్ 1లో ఎలాంటి కంటెంట్ ఉందో అందరికీ తెలిసిందేగా! చూస్తుంటే.. ఇందులో అంతకుమించి అడల్ట్ కంటెంట్ ఉండేలా కనిపిస్తోంది.

Love Tragedy: తన ప్రేమని అంగీకరించలేదని.. నడిరోడ్డుపైనే..

Show comments