Vijay TVK: విజయ్ డూప్’తో సీఎంను ఓడించిన బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో విజయ్ ఊహించని విధంగా తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పారు. తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రిగా ఇప్పుడు తమిళనాడు సహా దేశవ్యాప్తంగా ఆయన హాట్ టాపిక్ అయ్యారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, విజయ్ సుమారు 200 నియోజకవర్గాలు ఉంటే అందులో కేవలం 40 లోపే నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించారు. ఒక రకంగా మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్థులే ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో సీఎం స్టాలిన్ నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థిగా నిలబడిన వి.ఎస్. బాబు ఒక రకంగా వింతైన ప్రచారమే చేశారు. విజయ్ లాగా ఉండే విజయ్ డూప్‌ని రంగంలోకి దించి, విజయ్ ప్రచారానికి వచ్చినట్లుగా ప్రచారం చేయించారు. ఈ క్రమంలోనే స్టాలిన్‌ను సొంత నియోజకవర్గంలోనే ఓడించి బాబు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ విజయ్ డూప్స్‌కి రోజుకు పదివేల చొప్పున ఖర్చుపెట్టినట్లుగా తెలుస్తోంది. ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఎల్ఈడి ప్రొజెక్షన్ ద్వారా విజయ్ అక్కడే నిలబడి మాట్లాడుతున్న ఫీలింగ్ కలిగించే టెక్నాలజీని వాడుకున్నారు. ఇక స్టాలిన్‌ను ఓడించిన వి.ఎస్. బాబు విషయానికి వస్తే, ఆయన వయసు 75 సంవత్సరాలు. గతంలో అన్నాడీఎంకే సహా డీఎంకేలో కూడా ఆయన రాజకీయం చేశారు. ఉత్తర చెన్నై అసెంబ్లీ నుంచి డీఎంకే ఎమ్మెల్యేగా కూడా ఆయన పనిచేశారు. అలా డీఎంకే నుంచి వచ్చి, ప్రస్తుతం డీఎంకే చీఫ్‌గా ఉన్న స్టాలిన్‌నే ఓడించి ఆయన తమిళనాడు వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు.
Also Read
- Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
- Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
- Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
- Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
తాజావార్తలు
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!