Site icon NTV Telugu

టాప్ డైరెక్టర్స్ కోసం ఫోటోగ్రాఫర్‌ అవతారమెత్తిన విజయ్

Tamil Hero Vijay Shocking Remuneration for Telugu Debut

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ స్టార్ హీరో, దళపతి విజయ్ ఫోటోగ్రాఫర్‌ అవతారమెత్తారు. కోలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్లను ఒకచోట చేర్చి, విజయ్ వారి పిక్ తీయడం విశేషం. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలో ముగ్గురు టాప్ దర్శకులు అట్లీ, నెల్సన్ దిలీప్‌ కుమార్, లోకేష్ కనగరాజ్ కలిసి పోజులివ్వడం కన్పిస్తోంది. ఈ పిక్ లో వారి పైన “వాట్ ఎ లైఫ్” అనే బోర్డు ఉంది. ఈ చిత్రం క్రెడిట్‌ అంతా విజయ్ కే దక్కుతుంది. ఈ ముగ్గురు దర్శకులు కలిసి విజయ్ తో క్వాలిటీ టైం స్పెండ్ చేసినట్టు ఈ పిక్ చూస్తుంటే అర్థమవుతోంది. నెల్సన్ దిలీప్‌కుమార్ తో కలిసి తన తదుపరి చిత్రం చేస్తున్నాడు విజయ్‌.

Read Also : థమన్ షాకింగ్ ట్రాన్స్ఫార్మేషన్

నెల్సన్ దిలీప్‌కుమార్, విజయ్ కాంబోలో ప్రస్తుతం డార్క్ కామెడీ ‘బీస్ట్‌’ తెరకెక్కుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో విజయ్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కళానిధి మారన్ ఈ ప్రాజెక్ట్ కు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ 14న ‘బీస్ట్’ విడుదల కానుంది. మరోవైపు లోకేశ్ కనగరాజ్ తదుపరి యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్‌’లో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్‌ కలిసి నటిస్తున్నారు. మార్చి 31న ఈ చిత్రం వెండితెరపైకి రానుంది. ఈ రెండు సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మధ్యే థేరి, మెర్సల్, బిగిల్ వంటి చిత్రాలలో తలపతి విజయ్‌తో కలిసి పని చేసిన అట్లీ ఇప్పుడు బి-టౌన్ వైపు పయనిస్తున్నాడు. ఈ దర్శకుడు తన తదుపరి చిత్రాన్ని షారుఖ్ ఖాన్‌తో చేస్తున్నాడు.

Exit mobile version