NTV Telugu Site icon

Vijay Sethupathi: తెలుగులో విడుదల కానున్న వెట్రిమారన్ సినిమా…

Vidudala

Vidudala

ఫ్లాప్ అనేది తెలియని దర్శకుడు వెట్రిమారన్, స్టార్ హీరోలు తనతో సినిమా చెయ్యడానికి రెడీగా ఉన్నా కథకి సెట్ అయ్యే వాళ్లతోనే చేసిన సినిమా ‘విడుదలై పార్ట్ 1’. యాక్టర్ సూరి హీరోగా, విజయ్ సేతుపతి స్పెషల్ రోల్ లో కనిపించిన ఈ సినిమా మార్చ్ 31న ఆడియన్స్ ముందుకి వచ్చింది. రియలిస్టిక్ పోలిస్ డ్రామాని చూపించిన వెట్రిమారన్, విడుదలై సినిమాతో మరో హిట్ కొట్టాడు. వెట్రిమారన్ ది బెస్ట్ వర్క్ టిల్ డేట్ అని కాంప్లిమెంట్స్ ని అందుకుంటున్న విడుదలై సినిమా ఇప్పటివరకూ 27 కోట్లని రాబట్టింది. తమిళ వెర్షన్ లో మాత్రమే రిలీజ్ అయిన ఈ మూవీని గీత ఆర్ట్స్ తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేస్తున్నట్లు ఇటివలే అనౌన్స్ చేసింది.

Read Also: Trisha Krishnan: త్రిష వయస్సు తగ్గుతుందా ఏంటీ?

విడుదలై సినిమాకి ‘విడుదల’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసి ఏప్రిల్ 15న రిలీజ్ చెయ్యనున్నారు. ఏప్రిల్ 8న ఉదయం 11:30కి విడుదల సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నట్లు గీత ఆర్ట్స్ అనౌన్స్ చేసింది. తమిళనాడులో హిట్ టాక్ రాబట్టింది, వెట్రిమారన్ కి తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి క్రెడిబిలిటీ ఉంది కాబట్టి విడుదల పార్ట్ 1 సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే సమంతా నటిస్తున్న శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకి రానుంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ మూవీ ముందు ‘విడుదల పార్ట్ 1’ సినిమా తెలుగులో నిలబడుతుందా? సినీ అభిమానులు థియేటర్స్ కి వస్తారా అనేది ఆలోచించాల్సిన విషయమే.