Site icon NTV Telugu

Vijay Sethupathi: పుష్ప రిజెక్ట్ చేసిన సేతుపతి.. ఇదేంట్రా ఇలా చెప్పాడు?

Vijay Sethupathi

Vijay Sethupathi

Vijay Sethupathi Comments on Pushpa Role Rejection: విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన మహారాజ సినిమా జూన్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో తెరకెక్కిన ఈ సినిమాని తెలుగులో ఎన్విఆర్ సినిమాస్ బ్యానర్ మీద ఎన్వి ప్రసాద్ రిలీజ్ చేశారు. ఈ సినిమా రిలీజ్ కంటే ముందే తెలుగు ఆడియన్స్ కోసం కొన్ని ప్రీమియర్స్ వేశారు. ఆ ప్రీమియర్స్ పడినప్పటి నుంచి సినిమా గురించి ఒకటే టాక్, అది స్క్రీన్ ప్లే అద్భుతం అని అప్పుడు. ఇదే మాట తమిళంలోనూ వినిపిస్తోంది తమిళ తెలుగు భాషలలో సూపర్ హిట్ రెస్పాన్స్ తో దూసుకుపోతున్న ఈ సినిమాకి సంబంధించిన తెలుగు సక్సెస్ మీట్ ఈరోజు హైదరాబాద్లో నిర్వహించారు.

Bangladesh vs Nepal: రెచ్చిపోయిన తంజీమ్, ముస్తాఫిజుర్.. సూపర్-8కి బంగ్లాదేశ్..!

ఆ తర్వాత మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలకు విజయ్ సేతుపతి దర్శకుడు నిథిలన్ సినిమాలో కీలక పాత్రలో నటించిన నటరాజన్ అలియాస్ నట్టి సమాధానాలు చెప్పారు. ఇక ఈ సందర్భంగా విజయ్ సేతుపతిని ఒక మీడియా ప్రతినిధి మీకు పుష్ప సినిమా ఆఫర్ వస్తే దాన్ని రిజిక్ట్ చేశారట నిజమేనా అని అడిగితే ముందు అలాంటి ఆఫర్ ఏది తనకు రాలేదు అని క్లారిటీ ఇచ్చాడు విజయ్ సేతుపతి. ఇక ఆ తర్వాత మరో ట్విస్ట్ ఇచ్చాడు. అదేమిటంటే అన్ని సార్లు నిజం చెబితే బాగోదని కొన్నిసార్లు అబద్ధం కూడా చెబుతూ ఉండాలంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో అసలు ఆయన్ని పుష్ప సినిమా కోసం అప్రోచ్ అయ్యారా? లేదా అది ప్రచారమేనా? అనేది క్వశ్చన్ మార్క్ గానే నిలిచిపోయింది.

Exit mobile version