Site icon NTV Telugu

Varisu vs Thunivu: ‘వారిసు’ వర్సెస్ ‘తునివు’ పై విజయ్ స్పందన

Varisu Vs Thinuvu

Varisu Vs Thinuvu

Vijay Responds On Varisu Thunivu Box Office Clash: టాలీవుడ్‌లో సంక్రాంతి వార్ చిరంజీవి, బాలకృష్ణ మధ్య జరుగుతుంటే.. కోలీవుడ్‌లో అజిత్, విజయ్ మధ్య జరగబోతోంది. విజయ్ నటించిన ‘వారిసు’, అజిత్ యాక్ట్ చేసిన ‘తునివు’ సినిమాలు పొంగల్ రేసులో ఢీకొనబోతున్నాయి. విజయ్ ‘వారిసు’ సినిమా తెలుగులో ‘వారసుడు’ పేరుతో విడుదల కానుంది. అజిత్ సినిమా మాత్రం అదే పేరుతో రిలీజ్ అవుతోంది. విజయ్, అజిత్ సినిమాల విడుదలకు చాలా సమయం ఉండగానే.. ఇటు విజయ్, అటు అజిత్ ఫ్యాన్స్ మధ్య యుద్ధం మొదలైంది. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడంలో మునిగిపోయారు ఈ ఇద్దరు హీరోల అభిమానులు. అయితే దీనికి భిన్నంగా విజయ్ స్పందించటం విశేషం.

ఇలయ దళపతి విజయ్ అజిత్‌తో పోటీ గురించి మాట్లాడుతూ.. ‘హే జాలీ..!! రెండు సినిమాలను ఒకే రోజు విడుదల చేయండి. అజిత్ కుమార్ నాకు ప్రియమైన స్నేహితుడు. తునివుతో పాటు నా సినిమా కూడా బాగా అడాలి’ అని చెబుతున్నాడు. దీంతో అజిత్ అభిమానులు విజయ్‌ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు. ఇక ఈ రెండు సినిమాలపై తమిళనాట పూర్తి స్థాయిలో బజ్ ఉంది. ఇండియన్ మార్కెట్‌‌తో పాటు ఓవర్సీస్‌లోనూ రెండు సినిమాలు హాట్ కేక్స్ అని చెప్పవచ్చు. 2023 జనవరిలో తమిళనాట ఈ రెండు చిత్రాలకు సమస్థాయిలో థియేటర్స్ లభించనున్నాయి. అంతేకాదు తెలుగులోనూ ఈ రెండు డబ్బింగ్ సినిమాల విడుదలపై ఆసక్తి ఎంతగానో ఉంది. అయితే ఆ స్థాయిలో మన తెలుగు సినిమాలైన ‘వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి’ సినిమాలకు తమిళనాట ఆదరణ లేకపోవడం విశేషం.

Exit mobile version