NTV Telugu Site icon

Vijay- Rashmika: విజయ్- రష్మిక ఎంగేజ్ మెంట్.. అసలు నిజం ఇదే.. ?

Rash

Rash

Vijay- Rashmika: సినిమా ఇండస్ట్రీ లో రూమర్స్ కామన్. ముఖ్యంగా ఎఫైర్స్ గురించి అయితే నిత్యం ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఆ హీరో.. ఈ హీరోయిన్ ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారు అంటూ పుకార్లు వస్తూనే ఉంటాయి. ఇక టాలీవుడ్ లో అలాంటి రూమర్స్ ను ఎదుర్కుంటున్న జంటల్లో విజయ్ దేవరకొండ – రష్మిక జంట మొదటి స్థానంలో ఉన్నారు. గీత గోవిందం సినిమాతో వీరిద్దరి పరిచయం జరిగింది. అప్పటినుంచి ఈ జంట ఫ్రెండ్స్ అని చెప్పుకుంటున్నారు కానీ, వీరు రిలేషన్ లో ఉన్నారని నెటిజన్స్ స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు. అందుకు కారణాలు కూడా లేకపోలేదు.

నిత్యం ఈ జంట ఒక్కటిగానే కనిపిస్తూ ఉండడం. పండగలప్పుడు రష్మిక.. విజయ్ ఇంట్లో ఉండడం, ఇద్దరు కలిసి వెకేషన్స్ కు వెళ్లడం.. ఇలా ఎన్నో సంఘటనలు వీరు రిలేషన్ లో ఉన్నారని రుజువు చేశాయి. కానీ, ఎప్పుడు కూడా ఈ జంట బయటపడింది లేదు. రిలేషన్ లో ఉన్నారు అనే ఇప్పటివరకు పుకార్లు వచ్చాయి. అయితే తాజాగా.. వీరిద్దరూ ఫిబ్రవరిలో ఎంగేజ్ మెంట్ చేసుకుంటున్నారు అంటూ వార్తలు హల్చల్ చేశాయి. దీంతో విజయ్ పర్సనల్ టీమ్ ఈ వార్తలను ఖండించారు. అసలు ఈ వార్తలో నిజం లేదని, ఫేక్ న్యూస్ ఎవరు చెప్పారు అంటూ కొద్దిగా ఫైర్ అయ్యినట్లు తెలుస్తోంది. విజయ్ ప్రస్తుతం వెకేషన్ లో ఉన్నాడని, రష్మిక తన సినిమాల్లో బిజీగా ఉందని తెలిపారు. ఇలాంటి వార్తలను ఫ్యాన్స్ నమ్మొద్దని తెలిపారు. ఇక ఈసారి కూడా ఇది నిజం కాకపోవడంతో అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. ఏదిఏమైనా ఈ జంటలో ఎవరో ఒకరు పెళ్లి చేసుకొనేవరకు ఈ పుకార్లు ఆగేలా లేవు.

Show comments