Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Movie News Vijay Kirangadur Exclusive Interview About Salaar Movie

Salaar Movie: సలార్ సీక్రెట్స్ బయటపెట్టిన నిర్మాత.. ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

Published Date :December 20, 2023 , 6:01 pm
By Bhargav Chaganti
Salaar Movie: సలార్ సీక్రెట్స్ బయటపెట్టిన నిర్మాత.. ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ
  • Follow Us :
  • google news
  • dailyhunt

Vijay kiragandur Exclusive Interview about Salaar Movie: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’. అన్‌కాంప్ర‌మైజ్డ్ బ‌డ్జెట్‌తో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయే ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్‌తో ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించాడు. సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందగా డిసెంబ‌ర్ 22న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా ‘సలార్ సీజ్ ఫైర్’ మూవీ జర్నీ గురించి హోంబలే ఫిలిమ్స్ విజయ్ కిరగందూర్ కీలకమైన విషయాలను తెలియజేశారు. ఆ వివరాల్లోకి వెళితే

* ‘సలార్’ జర్నీ ఎలా ప్రారంభమైంది?
– మేం సలార్ సినిమాను 2021లో ముహూర్తం పెట్టి స్టార్ట్ చేశాం, కానీ తర్వాత కోవిడ్ సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యింది. కోవిడ్ వేవ్స్ కారణంగా సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి సమయం తీసుకున్నాం. 2022లో పూర్తి స్థాయి షూటింగ్ ప్రారంభమవగా ఈ ఏడాది జనవరిలో షూటింగ్‌ను పూర్తి చేశాం. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశాం, అయితే ఐదు భాషల్లో సినిమాను విడుదల చేయాలనుకున్నాం కాబట్టి చాలా జాగ్రత్తలు పాటిస్తూ వచ్చాం. అందులో డబ్బింగ్, సీజీ వర్క్ ఇలా అన్నింటికీ సమయం పట్టింది, అందుకే సినిమాను డిసెంబర్‌లో రిలీజ్ చేస్తున్నాం.

Also Read

  • Mangli: వివాదాల నడుమ మంగ్లీ కొత్త సాంగ్ రిలీజ్
  • Ntr Neel : ఎన్టీఆర్ నీల్ సినిమా రీ షూట్స్.. అసలు విషయం బయటపెట్టిన మైత్రి మూవీ మేకర్స్!
  • Tollywood Star Heroine: అవార్డులా? మాకొద్దు.. డబ్బుంటే పంపండి.. స్టార్ హీరోయిన్ తండ్రి సంచలనం!
  • Ashu Reddy: అంతా ఆయన ఇష్టపూర్వకంగా ఖర్చు చేసిందే.. హైకోర్టులో అషు రెడ్డి సంచలనం!

* మొదటి తెలుగు సినిమా కదా ఎలా అనిపించింది?
మా హోంబలే ఫిలిమ్స్ తొలిసారి తెలుగు హీరో ప్రభాస్‌గారితో వర్క్ చేశాం అయితే మిగిలిన టీమ్ అంతా పాతదే. ప్రశాంత్ నీల్, రవి బస్రూర్, ఆర్ట్ డైరెక్టర్ వీళ్లంతా హోంబలేతో అనుబంధం ఉన్నవాళ్లే. అయితే సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌తో మేకింగ్‌ను ఛాలెంజింగ్‌గా తీసుకుని తెరకెక్కించాం, ప్రభాస్‌ చాలా మంచి వ్యక్తి, అందువల్లనే ఈ జర్నీ మాకొక మెమొరబుల్ ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింది మరీ ముఖ్యంగా సినిమా 90 శాతం షూటింగ్‌ని తెలంగాణ, ఏపీలో చిత్రీకరించాం.

* ‘సలార్’ మేకింగ్ పరంగా ఎదురైన ఛాలెంజెస్టి?
– మేకింగ్ పరంగా ఛాలెంజెస్ అంటే పెద్దగా లేవు. అయితే కెజియఫ్ వంటి భారీ హిట్ మూవీ తర్వాత మా బ్యానర్‌లో ప్రభాస్ నటిస్తుండటం, ప్రశాంత్ నీల్ ఆ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో సినిమాపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. సలార్ కోసం ఓ కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసి, దాని కోసం మేకింగ్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు, మేకింగ్‌లో ఇలాంటి సవాళ్లు తప్ప, మరేం ఎదురు కాలేదు.

* నిర్మాతగా పదేళ్లు పూర్తయ్యాయి కదా మీ జర్నీ గురించి చెప్పండి?
– నేను నిర్మాతగా చేసిన తొలి సినిమా నిన్నిందలే, సెకండ్ మూవీ మాస్టర్ పీస్, తర్వాత రాజకుమార అయితే ఇవన్నీ మంచి విజయాలను సాధించాయి. రాజకుమార అయితే సూపర్ డూపర్ హిట్, ఇక నా నాలుగో సినిమా కె.జి.యఫ్1 తర్వాత యువరత్న, కె.జి.యఫ్ 2, కాంతార సినిమాలను రూపొందించా. ఇప్పడు సలార్‌తో మీ ముందుకు రాబోతున్నా, ఒక్కో మూవీ ఒక్కో అనుభవాన్ని నేర్పించింది. ప్రతీ విషయం నాకు మంచిగానే అనిపిస్తుంది. తొలి రోజు నేను ఇక్కడ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నిర్మాతగా నాకున్న నాలెడ్జ్‌కి ఇప్పుడు నాకున్న నాలెడ్జ్‌కి చాలా తేడా ఉంది, ముఖ్యంగా నెట్ వర్క్ పెరిగింది.

* కన్నడలో ప్రారంభమైన మీ ప్రయాణం ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌కి చేరుకుంది కదా!
– అవును కానీ నిర్మాతగా నా ఆలోచనా విధానంలో మార్పు లేదు. ఇండియన్ సినీ ఇండస్ట్రీ రేంజ్‌ని నెక్ట్స్ రేంజ్‌కి తీసుకెళ్లాలనేదే నా ఆలోచన, మన సంస్కృతి, సంప్రదాయాలు, భాషలు అన్నీ వేరువేరుగా ఉంటాయి, అయితే అన్నీ కలిస్తేనే ఇండియన్ సినీ ఇండస్ట్రీ అవుతుంది. దాన్ని గ్లోబెల్ రేంజ్‌కి తీసుకెళ్లాలనేదే నా అభిప్రాయం, అంతే తప్ప ఇది తెలుగు, ఇది కన్నడ సినిమా అని ఆలోచించడం లేదు.

* డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో మీకున్న అనుబంధం గురించి?
– ప్రశాంత్ నీల్‌ నాకొక డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు, తర్వాత ఫ్రెండ్, తర్వాత క్లోజ్ ఫ్రెండ్ అయ్యారు. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ అయిపోయాడు, సినిమా విషయానికి వస్తే తనకున్న క్రియేటివిటీకి నేనొక ఫ్లాట్ ఫామ్ మాత్రమే. తన క్రియేటివిటీకి ఏం కావాలనే విషయాలు సమకూర్చటం అనేది నిర్మాతగా నా బాధ్యత, దాన్ని నేను పూర్తి చేస్తున్నా. అలాగే ప్రొడక్షన్, మార్కెటింగ్‌లలో తన ఇన్‌వాల్వ్ కాడు. ఇలా ఇద్దరి మధ్య మంచి అనుబంధం, అవగాహనతో ముందుకెళ్తున్నాం, ఒకవైపు మా ప్రయాణం డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా ఉంటుంది అలాగే మరో వైపు ఇద్దరం మంచి స్నేహితులం.

* కెజియఫ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మీకు వస్తున్న రెస్పాన్స్ ఏంటి?
– ఆడియన్స్ నుంచి కె.జి.యఫ్ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ గురించి మాటల్లో ఎంత చెప్పినా తక్కువే, కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ ఆడియెన్స్‌లోనూ మంచి గుర్తింపు దక్కింది అయితే మమ్మల్ని చూసే విధానం మారింది. మాపై వాళ్లు చూపించిన ప్రేమాభిమానాలు, చూపించిన నమ్మకం మాలో మరింత బాధ్యతను పెంచాయి, అందుల్ల వాళ్లకి నచ్చేలా సినిమాలు చేయాలని ముందుకు వెళ్తున్నాం, మంచి సినిమాలు ఇవ్వాలనే కారణంగా మంచి కథలు ఎంచుకోవడంలో కాస్త ఆలస్యమవుతుంది తప్ప మరోటి కాదు.

* హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌లో వస్తున్న సినిమాలు రెండు భాగాలుగా చేయటానికి కారణమేంటి?
– నిజానికి కెజియఫ్ 1 ని స్టార్ట్ చేసినప్పుడు రెండో భాగం చేయాలని అనుకోలేదు, షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత అందులోని కంటెంట్‌ని గమనించిన డైరెక్టర్‌ టీమ్ అంతటినీ పిలిపించి కూర్చొని మాట్లాడారు. ఈ సినిమాను చేస్తే కుదించి చెప్పాలి, లేదా రెండు భాగాలుగా చేయాలని ఆయన అన్నారు. అలా కె.జి.యఫ్ 2 స్టార్ట్ చేశాం. అయితే కాంతార విషయంలో అలా కాదు, మా దగ్గర రెండు, మూడు కథలున్నాయి. అయితే కర్ణాటకలో ఎక్కడో మారుమూల ఉండే ఓ ప్రాంతానికి చెందిన ప్రజల సాంప్రదాయాన్ని, నమ్మకాన్ని ఇతరుల ఎలా తీసుకుంటారా? అని అనుకున్నాం. అయితే కొత్త ప్రయత్నం కదా, చేద్దామని కాంతార చేయగా ఆడియన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ‘కాంతార చాప్టర్ 1’ను చేయాలని అనుకుని స్టార్ట్ చేశాం, రెండు, మూడు పార్టులుగా రూపొందించేంత కంటెంట్ కాంతారలో ఉంది. ‘సలార్’ విషయంలోనూ అంతే, ఇందులో సినిమాను రెండు భాగాలుగా చేసేంత డ్రామా ఉంది, అందువల్లనే రెండు భాగాలుగా రూపొందించాలని అనుకున్నాం.

* ఓ సినిమా కథను ఓకే చేసే క్రమంలో నిర్మాతగా మీరెలా ఆలోచిస్తారు?
– ఎప్పుడైనా నేను చెప్పే మాట ఒకటే, బడ్జెట్ గురించి ఎక్కువగా డిస్కస్ చేయను. కాన్సెప్ట్ ఏంటి? కంటెంట్ ఎలా ఉంది. డైరెక్టర్ ఎవరు? డైరెక్టర్ చెప్పే కథ సెట్ అవుతుందా? ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు? స్టోరీ సీక్వెన్స్ కరెక్ట్‌గా ఉందా? ఈ సినిమా తీయడానికి ఇది కరెక్ట్ సమయమేనా? అనే విషయాలపై ఒకటికి పదిసార్లు ఆలోచిస్తా, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటా, కాంతార మినిమం బడ్జెట్‌తో చేశాం. ఆ సినిమా కావొచ్చు, మరో బిగ్ బడ్జెట్ మూవీ కావొచ్చు, నేను బడ్జెట్‌ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వను. నాకు స్టోరీ, డైరెక్టర్ ముఖ్యం.

* తెలుగు ఇండస్ట్రీ, ఆడియన్స్ నుంచి మీకు వస్తున్న రెస్పాన్స్ ఎలా ఉంది?
– ఒక్కమాటలో చెప్పాలంటే సింప్లీ సూపర్బ్. ఇండస్ట్రీ వాళ్లందరూ చక్కగా రిసీవ్ చేసుకున్నారు, ఇక్కడి ఆడియెన్స్ రెస్పాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, వాళ్లు సినిమాను ఆదరిస్తున్న తీరే అందుకు ఉదాహరణ.

*‘సలార్’పై ఎక్స్‌పెక్టేషన్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది?
– ప్రభాస్ ఓ సూపర్ స్టార్, పాన్ ఇండియా రేంజ్‌లో ప్రశాంత్ నీల్ పెద్ద డైరెక్టర్. ఆయనకొక ఇమేజ్ క్రియేట్ అయ్యింది. వీరిద్దరి కాంబినేషన్‌లతో సినిమా అంటే ఎలా ఉండబోతుందోనని ఫ్యాన్స్, ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. కెజియఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ ఎలాంటి కథను చూపించబోతున్నాడో, ప్రభాస్‌ను ఎలా చూపించబోతున్నారనే అందరూ ఎగ్జయిట్ గా చూస్తున్నారు.

* సలార్ మూవీ కోసం ఒక్క గ్రాండ్ ఈవెంట్ ఎందుకు కండక్ట్ చేయలేదు?
– టైట్ టైమ్ షెడ్యూల్ లో ఉన్నాం, ఓ వైపు ప్రభాస్‌, మరో వైపు ప్రశాంత్ నీల్ ఇద్దరూ బిజీగా ఉన్నారు. సినిమా రిలీజ్ తర్వాత గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌ను కండెక్ట్ చేస్తాం అని ఇంటర్వ్యూ ముగించారు చిత్ర నిర్మాత విజయ్ కిరగందూర్.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • salaar movie
  • Salaar Movie News
  • Vijay Kirangadur Exclusive Interview
  • Vijay Kirangadur Interview

తాజావార్తలు

  • RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు

  • Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?

  • Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?

  • AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..

  • Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions