Kingdom : విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కింగ్ డమ్ మూవీ జులై 31న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా.. సితార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డ ఈ మూవీ ఈ సారి రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా తిరుపతిలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. అందులోనే ట్రైలర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేశారు.
Read Also : Kingdom : ఏ నా కొడుకు నన్ను ఆపలేడు.. విజయ్ షాకింగ్ కామెంట్స్..
ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్లు, టీజర్లలో కథ గురించి గానీ జానర్ గురించి గానీ ఎలాంటి హింట్ ఇవ్వలేదు. తాజాగా వచ్చిన ట్రైలర్ లో మూవీ ప్రపంచాన్ని చూపించారు. విజువల్ పరంగా ట్రైలర్ అదిరిపోయింది. ఈ ట్రైలర్ లో యాక్షన్ తో పాటు ఎమోషన్ ను హైలెట్ చేసి చూపించారు. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీని తీస్తున్నట్టు ట్రైలర్ లో తెలిసిపోతోంది. ఇది ఒక హై ఎమోషన్, యాక్షన్ ట్రైలర్ లా కనిపిస్తోంది. ఇందులో విజయ్ దేవరకొండ లుక్, టైమింగ్ బాగున్నాయి.
