Site icon NTV Telugu

Family Star: దేవర రావట్లేదు కానీ బదులుగా ‘దేవర’కొండని పంపిస్తున్నాడు

Devarakonda On Devara Date

Devarakonda On Devara Date

Vijay Deverakonda’s Family star to release on Devara Missed Date: జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న సినిమా దేవర. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని ముందు నుంచి ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే ఈరోజు ఉదయం ఈ విషయం మీద సినిమా యూనిట్ క్లారిటీ ఇచ్చింది. పుకార్లకు బ్రేకులు వేస్తూ ఏప్రిల్ 5వ తేదీన కచ్చితంగా వస్తున్నామని పేర్కొంది. అయితే మధ్యాహ్నానికి ఎన్నికల షెడ్యూల్ కి సంబంధించిన అప్డేట్ రావడంతో సినిమా వాయిదా వేసుకోవడానికి నిర్ణయం తీసుకున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.

Pushpa The Rule : యానిమల్ ను మించిన ఇంటర్వెల్ బ్లాక్ లోడింగ్

ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన రాలేదు కానీ అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత మరో ఆసక్తికరమైన ప్రకటన కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అదేమిటంటే దేవర సినిమా కనుక ఏప్రిల్ ఐదో తేదీ నుంచి వాయిదా వేస్తున్నట్లు గనక ప్రకటిస్తే అప్పుడు ఫ్యామిలీ స్టార్ అదే డేట్ కి రిలీజ్ చేయాలని దిల్ రాజు భావిస్తున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా అయితే పాన్ ఇండియా కాబట్టి ఆ రోజు రిలీజ్ చేస్తే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కానీ తమ ఫ్యామిలీ స్టార్ తెలుగు ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని నిర్మాతగా దిల్ రాజు భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. పరశురాం పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఇక ఈ సినిమాని కచ్చితంగా ఏప్రిల్ 5వ తేదీన రంగంలోకి దించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో దేవర దిగకుండా దేవరకొండని దింపుతున్నాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

Exit mobile version