పెద్దగా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఎంట్రీ ఇచ్చి ఈరోజు టాప్ హీరోలలో ఒకరిగా దూసుకుపోతున్నాడు విజయ్ దేవరకొండ. ఆయన చివరి సినిమా లైగర్ డిజాస్టర్ అయినా ఆయన క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు సరి కదా సోషల్ మీడియాలో ఇంకా ఇంకా రచ్చ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కూడా వెనక్కి నెట్టేశారు అనే వార్త సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే అసలు విషయం ఏంటంటే విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఖుషీ సినిమా నుంచి ఆరాధ్య అనే ఒక సాంగ్ రిలీజ్ అయింది.
Baby: ఫస్ట్ డే అదిరింది ‘బేబీ’! చిన్న సినిమాల్లో ఇదో సెన్సేషన్
మలయాళ హృదయం మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్ వాహాబ్ సంగీతం అందించిన ఈ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఈ సాంగ్ రిలీజ్ అయిన గంటల వ్యవధిలోనే రిలీజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ లోని సెకండ్ సింగిల్ జజ్జనక అనే సాంగ్ అలాగే పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కుతున్న బ్రో ది అవతార్ సినిమాలోని మార్కండేయ సాంగ్స్ తెలుగు ఆడియన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేదు. భోలా శంకర్ సినిమాకి మణిశర్మ కొడుకు మహతి స్వర సాగర్ సంగీతం అందించగా బ్రో సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. అలా విజయ్ దేవరకొండ ఆరాధ్య సాంగ్ భోళా శంకర్ సెకండ్ సింగిల్, బ్రో లోని మార్కండేయ సాంగ్స్ ను వెనక్కి నెట్టి మరీ యూట్యూబ్ లో 1 ట్రేండింగ్ లో ఉండడం గమనార్హం.