NTV Telugu Site icon

VD 13: ఫ్యామిలీ స్టార్ అన్నారు… పిల్లలు కూడా ఉన్నారు కానీ చేతికి ఆ రక్తం ఏంటి?

Vd 13

Vd 13

రౌడీ హీరో విజయ్ దేవరకొండని యూత్ కి, ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేసిన సినిమా గీత గోవిందం. ఈ మూవీతో డైరెక్టర్ పరశురామ్-విజయ్ దేవరకొండ కాంబినేషన్ కి మంచి పేరొచ్చింది. గీత గోవిందం కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ దాదాపు అయిదేళ్ల తర్వాత కలిసి సినిమా చేస్తున్నారు. VD 13 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండగా మృణాల్ హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి ‘ఫ్యామిలీ స్టార్’ అనే టైటిల్ ని కన్సిడర్ చేస్తన్నట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజముందనే విషయం అక్టోబర్ 18 సాయంత్రం 6:30 నిమిషాలకి తెలియనుంది.

Read Also: Deepika Padukone: సింగం ఫ్రాంచైజ్ లోకి దీపికా ఎంట్రీ…

VD13 టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ని ఆరోజే రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసారు. ఈ విషయాన్నీ రివీల్ చేస్తూ మేకర్స్ వదిలిన ప్రీలుక్ పోస్టర్ లో విజయ్ దేవరకొండ చిన్నపిల్లలతో ఉన్నాడు. ఫ్యామిలీ స్టార్ టైటిల్ అన్నారు, పోస్టర్ లో స్కూల్ యూనిఫార్మ్ వేసుకున్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు కానీ విజయ్ దేవరకొండ చేతికి మాత్రం రక్తం ఎందుకు ఉందో తెలియాల్సి ఉంది. ఫ్యామిలీ స్టార్ కి పరశురామ్ పెట్ల కాస్త యాక్షన్ టచ్ కూడా ఇచ్చినట్లు ఉన్నాడు. మరి VD 13 నామకరణం టైటిల్ టీజర్ ఎలా ఉంటుంది? విజయ్ దేవరకొండని పరశురామ్ ఎంత కొత్తగా చూపిస్తాడు అనేది చూడాలి.