NTV Telugu Site icon

Vijay Deverakonda: ప్రీలుక్ ఇంప్రెస్ చేసింది… #VD12 రామ్ చరణ్ మార్కెట్ రేంజులో ఉంటుందా?

Vd 12

Vd 12

రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైనప్ లో ఉన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘VD 1 2’. జెర్సీ లాంటి ఫీల్ గుడ్, మోడరన్ క్లాసిక్ మూవీని ఆడియన్స్ కి ఇచ్చిన గౌతమ్ తిన్నునూరి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఇటివలే లాంచ్ అయ్యింది. మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీలా, విజయ్ దేవరకొండకి పెయిర్ గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ స్పీ థ్రిల్లర్ గా తెరకెక్కనుంది. ఖుషి మూవీ అయిపోయాక సెట్స్ పైకి వెళ్లనున్న ‘VD 12’ నుంచి స్పెషల్ సర్ప్రైజ్ బయటకి వచ్చింది. విజయ్ దేవరకొండ బర్త్ డే కావడంతో సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి ‘ప్రీలుక్’ పోస్టర్ ని రిలీజ్ చేశారు. “A tale of every spy can end up being a conspiracy theory. But their truth can never be disregarded! Wishing our Rowdy, THE #VijayDeverakonda, a very Happy Birthday from team #VD12 “. ప్రీలుక్ పోస్టర్ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. ఒక స్పై లైఫ్ ఎప్పుడూ ఓపెన్ బుక్ కాదు, అది బిట్స్ అండ్ పీసెస్ గానే ఉంటుంది. అన్ని సంఘటనలని ఒక చోట చేరిస్తేనే అది ఒక పూర్తి కథవుతుంది. తమ ఐడెంటిటీని సొంత వాళ్లకి కూడా చెప్పుకోకుండా, దేశం కోసం యుద్ధం చేస్తున్న స్పై చుట్టే VD 12 కథ నడుస్తున్నట్లు ఉంది.

అసలు విజయ్ దేవర్కొండ ఈ సినిమాలో ఎలాంటి స్పై, అతను ట్రైటరా లేక పేట్రియాటా అనేది తెలియాల్సి ఉంది. హీరో క్యారెక్టర్ గురించి హింట్ ఇస్తూ “నేను ఎవరిని మోసం చేసానో తెలియడానికి, నేను అసలు ఎక్కడి వాడినో తెలియదు” అనే క్యాప్షన్ ని ప్రీలుక్ పోస్టర్ లో పెట్టారు. దీన్ని బట్టి చూస్తే ఇది లైట్ గా డ్యూయల్ సిటిజెన్షిప్ ఉన్న ఒక ఏజెంట్ కథగా, డబుల్ ఏజెంట్ కథగా కనిపిస్తోంది. మరి ఎమోషన్స్ ని స్ట్రాంగ్ గా ప్రాజెక్ట్ చేసే గౌతమ్ తిన్నునూరి, ఈ స్పై కథతో కూడా ఎలాంటి ఎమోషనల్ కథ చెప్తాడో చూడాలి. ఇదిలా ఉంటే ఈ సినిమా అసలు రామ్ చరణ్ చెయ్యాల్సి ఉంది. గౌతమ్ తిన్నునూరి ఈ కథని రామ్ చరణ్ కోసమే రాసుకున్నాడు, అంటే చరణ్ మార్కెట్ ని, చరణ్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకోని కథని రాసి ఉంటాడు. ఇప్పుడు చరణ్ ఇమేజ్ ఉన్న కథతో విజయ్ దేవరకొండ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడు అనేది చూడాలి.