Site icon NTV Telugu

Vijay Deverakonda: సంధ్య థియేటర్ దగ్గర ఫ్యాన్స్ రెడీగా ఉండండి రౌడీ వస్తున్నాడు

Kushi

Kushi

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, లేడీ సూపర్ స్టార్ సమంత కలిసి నటించిన ఖుషి మూవీ మొదటి రోజు మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని సెంటర్స్ లో ఖుషి మంచి బుకింగ్స్ ని రాబడుతుంది. డైరెక్టర్ శివ నిర్వాణ లవ్ స్టోరీని డీల్ చేసిన విధానానికి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అట్రాక్ట్ అవుతున్నారు. అన్ని సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ రాబడుతున్న ఖుషి ఓవర్సీస్ లో మరింత జోష్ లో బుకింగ్స్ రాబడుతోంది. సెకండ్ డేకే 1 మిలియన్ మార్క్ ని టచ్ చేసిన ఖుషి, వీకెండ్ అయ్యే సరికి 1.75-2 మిలియన్ డాలర్స్ ని రాబట్టే అవకాశం ఉంది.

Read Also: Ariyana Glory: ఏంటి అరియనా.. ఇంత బొద్దుగా తయ్యారయ్యావు

సాలిడ్ హిట్ కొట్టడంతో ఖుషి చిత్ర యూనిట్, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ యాదాద్రి వెళ్లి దేవుడిని దర్శించుకున్నారు. ఇక్కడి నుంచి విజయ్ దేవరకొండ డైరెక్ట్ గా సంధ్య థియేటర్ కి రానున్నాడు. ఫ్యాన్స్ తో కలిసి విజయ్ దేవరకొండ ఖుషి సినిమా చూడబోతున్నాడు. ఈ విషయాన్ని మేకర్స్ అనౌన్స్మెంట్ ఇవ్వడంతో రౌడీ హీరోని కలవడానికి ఫ్యాన్స్ సంధ్య థియేటర్ కి క్యూ కడుతున్నారు. మరి ఫుల్ రన్ లో విజయ్ దేవరకొండ ఎంత కలెక్ట్ చేస్తాడు? ఎన్ని డేస్ లో బ్రేక్ ఈవెన్ చేస్తాడు అనేది చూడాలి.

Exit mobile version